రజనీ అభిమానులకు సౌందర్య ను గుర్తు చేసిన రాధిక  

Radhika Apte Remembers Soundarya

01:14 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Radhika Apte Remembers Soundarya

తెలుగు తమిళ తదితర భాషల్లో ఎన్నో చిత్రాలలో తన నటనతో సెహ్ బాష్ అన్పించుకుని, చిన్న వయస్సులోనే స్వర్గం చేరిన సొందర్య అంటే అందరికీ గుర్తే. అయితే దక్షినాది సూపర్ స్టార్ రజనీ కాంత్ కి ఉన్నట్టుండి సౌందర్య గుర్తొచ్చింది. మరి వివరాల్లోకి వెళ్ళాల్సిందే. ‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’, ‘లయన్’ తదితర సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే తెల్సు కదా. ఈ ముద్దుగుమ్మ తాజాగా రజనీకాంత్ సరసన ‘కబాలి’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధిక ఆప్టే వయసైపోయిన డాన్ పాత్రలో రజనీ కనపడనున్న ఈ సినిమాలో ఆయన భార్యగా నటంచిన రాధిక ఆప్టే కూడా జుట్టుకు తెల్ల రంగేసుకుందట. అప్పట్లో పడయప్ప పత్నిగా అంటే, నరసింహ సినిమాలో రజనీకి జంటగా నటించేందుకు సౌందర్య కూడా తెల్లరంగు వేసుకుంది. ఈ కాలంలో ముద్దుగుమ్మలు 40ల్లో ఉన్నా 20ల్లోలా కనపడటానికే ఎక్కువ తాపత్రయ పడుతుంటే, రాధిక మాత్రం అందుకు భిన్నంగా వుందట. అందుకే సౌందర్యని గుర్తు చేసిందని అభిమానులు తెగ సంబర పడిపోతున్నారట. మరి పుష్కర కాలం క్రితమే చనిపోయిన సౌందర్యను రజనీ అభిమానులకు గుర్తుచేసిన రాధిక కు మంచి మార్కులే పడుతున్నాయి.

English summary

Super Star Rajini Kanth's upcoming movie was Kabali and in this movie Radhika Apte was acted as a wife to Rajinikanth.Rajini kanth to play as a old Don character in this movie.Radhika also played an old woman role by coloring white color to her hair. and she remembers Sowndarya in Narasimha movie.