ఆ సీన్స్ పై రాధిక గరం గరం ...

Radhika Apte Serious On Parched Movie Makers

10:26 AM ON 16th September, 2016 By Mirchi Vilas

Radhika Apte Serious On Parched Movie Makers

యాక్ట్ చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతారు. ఆతర్వాత ఏమైనా ఇబ్బంది వస్తే తెగ ఫీలయిపోతారు. ఇంకా చెప్పాలంటే సీరియస్ కూడా అయిపోతారు. ఇప్పుడు పర్చేద్ మూవీ హాట్ సన్నివేశాలు బయటకు రావడంపై షాకైన హీరోయిన్ రాధికాఆఫ్టే కూడా సీరియస్ అవుతోందట. ఇంతకీ విషయం ఏమంటే, ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఈ మూవీని ఇండియాలో విడుదల చేయమని, ఒకవేళ చేసినా హాట్ సన్నివేశాల్ని పూర్తిగా తొలగిస్తామని మేకర్స్ మాట ఇచ్చారట. ఈ నేపథ్యంలో నటించడానికి ఓకే చేసిందట రాధిక. ఈలోగా అనధికారికంగా ఆ సినిమాలోని హాట్ సన్నివేశాలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టడంతో రాధిక సీరియస్ అయిపొయింది.

ఇక్కడ మరో టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే, ఇంటర్నెట్ లో లీకైనవి కేవలం నాలుగు నిమిషాలేనని, కానీ చిత్రంలో 20 నిమిషాలపాటు వున్నాయట. వీటిని సీడీలుగా వేసి కోల్ కత్తా వీధుల్లో అమ్మేస్తున్నారంటూ ఓ వ్యక్తి రాధికా ఆఫ్టేకు చెప్పడంతో మేకర్స్ పై కాసింత గరంగానే వుందని సమాచారం. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోందట ఈ అమ్మడు. ఇక నటుడు అజయ్ దేవ్ గన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో 18 అవార్డులను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి: శృంగార సన్నివేశాల్లో తగ్గే ప్రసక్తే లేదు!

ఇవి కూడా చదవండి: వండిన ఆహారాన్ని 48 నిముషాల్లోపే తినేయాలి.. ఎందుకంటే?

English summary

Hot Heroine Radhika Apte was always into controversies and recently she acted in a film called Parched and there were some hot scenes in the movie and she acted nude in that movie also. Radhika Apte said that the film makers promised her to they will not release movie in India but some of the hot scenes of here were selling in the market in the form of CD's.