శరత్ కుమార్ కేసు కొట్టివేత... విశాల్, కార్తీలపై రెచ్చిపోయిన రాధిక!

Radhika fires on Vishal and Karthi

11:13 AM ON 29th November, 2016 By Mirchi Vilas

Radhika fires on Vishal and Karthi

నడిఘర్ సంఘం నుండి తాత్కాలికంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ మునుపటి కార్యవర్గంలోని అధ్యక్షుడు శరత్ కుమార్, కార్యదర్శి రాధారవి దాఖలు చేసిన పిటీషన్ ను మద్రాస్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కొన్ని రోజుల క్రితం దాఖలైన ఈ కేసు సోమవారం విచారణకు రాగా, గత ఆదివారం జరిగిన నడిఘర్ సంఘం సర్వసభ్య సమావేశంలో శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటించడం వల్ల జస్టిస్ ఎంఎం సుందరేశ్ ఈ కేసును కొట్టివేశారు. అయితే శాశ్వత తొలగింపుపై శరత్ కుమార్ కొత్త పిటీషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు.

1/4 Pages

అసలు సొసైటీ చట్టం తెలుసా?


అయితే, శరత్ కుమార్ తొలగింపుపై ఆదివారం ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాధిక సోమవారం మీడియాతో ఆవేశంగా మాట్లాడింది. ఇద్దరు పెద్ద నటుల్ని తొలగిస్తున్నామని సర్వసభ్య సమావేశంలో ఎజెండాలో ఉన్నప్పుడు అందరికీ తెలియజేయాలి. తెలిసుంటే నేనూ వెళ్లుండేదాన్ని. సరే, శరత్ కుమార్ ని తొలగించేందుకు అందరూ సమ్మతించారా? అసలు సొసైటీ చట్టం ప్రకారం ఎవర్నీ శాశ్వతంగా తొలగించకూడదు. దీని గురించి అడిగితే... ఈ విషయం గురించే మాకు తెలీదని నటుడు ప్రభు, ఇంకా చాలామంది నటులు చెప్పారు.

దీనర్ధం ఏమిటి? శరత్ కుమార్ వేసిన కేసు సోమవారం విచారణ జరుగబోతుందని అందరికీ తెలుసు. విచారణ దశలో ఉన్న కేసుకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోకూడదని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పింది. అయినా ముందు రోజు శాశ్వతంగా తొలగించడమేంటి? అని రాధిక రెచ్చిపోయింది. అంతేకాదు, ఈ సర్వసభ్య సమావేశమే చెల్లదని, వేదిక మార్చుతున్నప్పుడు కనీసం 21 రోజుల తరువాతే సమావేశం జరపాలన్నారు.

English summary

Radhika fires on Vishal and Karthi