అవును.. చిరంజీవిని ఆ హీరోయిన్ నిజంగా కొట్టేసింది

Radhika slapped Mega Star Chiranjeevi

10:51 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Radhika slapped Mega Star Chiranjeevi

ఏదో అవ్వాలని మరేదో అవ్వడం సినీ పరిశ్రమలో ఉన్నవాళ్లకు మామూలే. ఇక అదే కోవకు చెందిన డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి. ఈయన తెలుగు సినీహీరో కావాలని కలలు కని సినీ ప్రపంచంలోకి వచ్చిన అవకాశాలు రాక, అసిస్టెంట్ డైరెక్టర్ గా గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టారు. కన్నతల్లి అభిలాష కోసం డైరెక్టర్ గా మారిన ఆయనే సినీరంగ విజేత గా నిలిచారు. ఆరోజుల్లో అందరి హీరోలతో సినిమాలు తీసి హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్ గా ఈయనకు పేరుంది. సినీ ప్రపంచంలో చిరుజీవిగా ప్రవేశించిన కొణిదల శివ శంకర్ వర ప్రసాద్ ని సుప్రీం హీరోగా తెలుగు తెరపై ఆవిష్కరిం చిన ఘనత కోదండ రామిరెడ్డిదే. అయితే కొడుకు వైభవ్ ని సినీ రంగంలో ప్రవేశ పెట్టినా, స్టార్ డం ఇవ్వలేకపోయారు. మొన్న నగరంలోని ఒక ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన కోదండరామిరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏఎన్నార్ , ఎన్టీఆర్ , చిరంజీవి, నాగార్జున, శోభనబాబు, బాలకృష్ణ తదితర హీరోలందరితో చేసిన ఈయన ఎవరితో ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యవహరించారు. ఈ సందర్బంగా ఓ యదార్ధ ఘటన వివరించారు.

' చిరంజీవి, రాధికలతో న్యాయం కావాలి సినిమా తీస్తున్నా. చిరంజీవిని ఒక సీన్ లో రాధిక కొట్టాలి. అయితే రాధిక నిజంగానే చిరంజీవిని కొట్టేసింది. దీంతో చిరంజీవి షాక్ అయ్యాడు. మరో సీన్ లో చిరంజీవి రాధికను కొట్టాలి. అతను కూడా ఆ సీన్ లో నిజంగానే రాధికను కొట్టాడు. ఇక వీరి ద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తదుపరి చిత్రమైన అభిలాషలోనూ చిరంజీవి, రాధిక నటిస్తున్నారు. అయితే, వీరిద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు. వారివురికి నచ్చ చెప్పా. దీంతో వారిద్దరూ తమ ఇగోలను వదిలారు. ఫలితంగా అభిలాష సినిమా సూపర్ హిట్ అయింది' అని కోదండరామిరెడ్డి వివరించారు.

ఇది కూడా చూడండి: వాట్సప్ లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా

ఇది కూడా చూడండి: ఫేస్ బుక్ లో అపరిచితులతో చాటింగ్ చేస్తున్నారా..పారాహుషార్

ఇది కూడా చూడండి: ప్రపంచంలో భారత్ ని సగర్వంగా నిలబెట్టిన అరుదైన 12 అంశాలు

English summary

kodandarami reddy talking about mega star, he remembering old memories. He tells Radhika slapped Mega Star Chiranjeevi and chiru also slapped then both are getting angry.