సుధాకర్ చెంప పగులగొట్టిన రాధిక!

Radhika slaps Sudhakar

12:30 PM ON 1st August, 2016 By Mirchi Vilas

Radhika slaps Sudhakar

సుధాకర్ తన నటనతో ప్రేక్షకుల్లో ఎలాంటి ముద్రను వేశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాస్యాన్ని ఆదరించే ప్రేక్షకులకు, సినీ ప్రియులందరికీ ఈ విషయం తెలిసిందే. హీరోగా, విలన్ గా, సహనటుడిగా కోలీవుడ్, టాలీవుడ్ చిత్రసీమలో ఓ వెలుగువెలిగిన సుధాకర్ విలక్షణమైన హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకుల్లో కమీడియన్ గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తొలిసారే హీరోగా తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సుధాకర్ తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ కమీడియన్లలో ఒకరిగా మారారు. అనారోగ్య సమస్యల నుండి పూర్తి స్థాయిలో కోలుకున్న సుధాకర్ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సుధాకర్ ఆసక్తికర విషయాలు చెప్పారు.

సుధాకర్ మాట్లాడుతూ.. తమిళంలో నేను హీరోగా చేస్తున్న రోజులు.. రాధికతో తొలి సినిమా. ఆమె ఎం.ఆర్.రాధ గారి కూతురు కావడంతో కాస్త భయంగా ఉండేది. మా ఇద్దరి మధ్య తొలి సీన్ రాధిక పరుగెత్తుకుంటూ నా దగ్గరికి రాగానే నేను ఎత్తుకుని తిప్పాలి. అయితే ఆమెను ఎత్తుకున్న సమయంలో అనుకోకుండా నా చేయి ఆమె లంగాలోకి వెళ్లింది. దీంతో రాధికకు కోపం వచ్చి నా చెంపపై గట్టిగా కొట్టింది. తొలిరోజు షూటింగులోనే ఇలా అయిందేంటి అని షాకయ్యాను. షూటింగ్ బాగా రావడానికి తమ మధ్య సాన్నిహిత్యం పెరిగాలని కలిసి సినిమాలకు వెళ్లడం, కలిసి డిన్నర్ కు వెళ్లడం లాంటివి చేయాలన్నారు. తర్వాత ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. 13 సినిమాల్లో కలిసి నటించాం అని సుధాకర్ చెప్పుకొచ్చారు. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ ఎంట్రీ ఇస్తున్న సుధాకర్ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచాలని కోరుకుందాం.

English summary

Radhika slaps Sudhakar