భారతీరాజాను దొంగ అనేసిన రాధిక..

Radhika thought that Bharathiraja is thief

05:33 PM ON 21st September, 2016 By Mirchi Vilas

Radhika thought that Bharathiraja is thief

మనుషుల జీవితాల్లో కొన్ని విచిత్ర ఘటనలు ఉంటాయి. మరికొన్ని ఆగ్రహం కలిగించే ఘటనలు ఉంటాయి. ఇక సినిమా వాళ్ళైతే మరీను. ముఖ్యంగా వాళ్ళ జీవితాలను కదిపి చూస్తే, ఎన్నో విషయాలు బయట పెడతారు. ఇక అలనాటి హీరోయిన్ రాధిక విషయానికి వస్తే, అటు తమిళం ఇటు తెలుగు చిత్రాల్లో తనదైన ముద్రవేసింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో చిత్రాల్లో నటించి, స్టెప్పులతో కుమ్మేసింది. హిట్ జంటగా నిలిచారు కూడా. సినీ హీరోయిన్ అవకాశాలు తగ్గుతున్న సమయంలో బుల్లితెరమీదికి వచ్చేసింది. అటు సినిమాల్లో కూడా విభిన్న పాత్రలతో అలరిస్తూనే వుంది. ఇక ఇటీవల ధర్మదురై అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధిక ప్రస్తుతం సూర్య కథానాయకుడుగా నటిస్తున్న 'ఎస్-3' చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రంలో ఆమె శృతిహాసన్ తల్లి పాత్రను పోషిస్తున్నట్లు టాక్. ఇక ఈవేళ రాధిక బర్త్ డే. ఈసందర్భంగా సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించిందో చెబుతూ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. మద్రాసులో 1977లో ఓ రోజు. భారతీరాజా అప్పుడే కొత్తగా తమిళ సినిమా దర్శకుడు అయ్యారు. ఆయన మొదటి సినిమా 19 వయధినిలే మంచి విజయం సాధించింది. ఆ ఉత్సాహంతో రెండో సినిమాకు కథ సిద్ధం చేసుకుంటూ, కొత్త వాళ్లతో తీయాలనే ఉద్ధేశంతో నటుల కోసం వెతుకుతున్నారు. టీనగర్ లో ఓ స్నేహితుడు టీ కోసం పిలిచాడు. వాళ్లింట్లో ఆల్బమ్ చూస్తుంటే, చిలిపిగా నవ్వుతున్న ఓ అమ్మాయి ఫోటో ఆయన కంటపడింది. ఎవరీ అమ్మాయి..? అని అడిగాడు. మా పక్కింటి పిల్ల రాధిక.. అంటూ వాళ్లూ యథాలాపంగానే చెప్పారు.

ఆ మరుక్షణం భారతీరాజా పక్కింట్లో వాలాడు. టీనేజర్ పిల్లగా వున్న రాధిక అప్పుడే నిద్ర లేచింది. జుట్టంతా విరబోసుకుని ఇంటి ముందు గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పోస్తోంది. సరిగ్గా అదేసమయంలో గేటు తీసుకుని లోపలికి వచ్చిన భారతీరాజాను చూసిన దొంగ అని పొరబడి గట్టిగా రాధిక కేకలు వేసింది. దీంతో ఇంట్లో వాళ్లంతా కంగారుగా బయటికి వచ్చారు. భారతీరాజా తానొక సినిమా దర్శకుడినని చెప్పుకొని ఆ ఇంట్లో వాళ్లనంతా నమ్మించడానికి చాలా కష్టపడ్డాడట. మీ అమ్మాయి రాధికను నటించమని అడుగుదామని వచ్చానండీ అని భారతీరాజా అనడంతో, రాధిక పకపకా నవ్వేసింది.

సార్.. జోక్ చేస్తున్నారా. నా మొహాన్ని సరిగ్గా చూశారా. ఎవరు చూస్తారు నా మొహాన్ని అని నవ్వుతూ అడిగింది. కానీ ఆమె తల్లి మాత్రం రాధిక సినిమాలో చేస్తుందని చెప్పేసిందట. అంతేకాదు కొంచెం స్వరం పెంచి, రాధిక ఎవరనుకుంటున్నారు మంచి నటుడిగా పేరొందిన ఎం.ఆర్. రాధ కూతురు' అనేసింది. అలా రాధిక తూర్పు వెళ్లే రైలు చిత్రంతో సినీ కెరీర్ ను ప్రారంభించి, ఎన్నో పాత్రలకు ఆమె ప్రాణం పోసింది.

ఇది కూడా చదవండి: మీరిష్టపడే అమ్మాయి మిమ్మల్ని సీక్రెట్ గా లవ్ చేస్తుందేమో తెలుసుకోండిలా!

ఇది కూడా చదవండి: కార్ నడుపుతూ ముద్దుల్లో మునిగి తేలిన ఇద్దరమ్మాయిలు.. ఇంతలో..

ఇది కూడా చదవండి: ఫ్రీగా ఇంటర్నెట్ కావాలంటే మీ ఫోన్ లో ఈ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోండి

English summary

Radhika thought that Bharathiraja is thief. Director Bharathiraja went to Radhika's house for the first time. At that time Radhika was at out side and she thought that he was the thief.