రేడియా జాకీ కునాల్‌ భార్య ఆత్మహత్య!!

Radio Jackie Kunal's wife suicide

11:22 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

Radio Jackie Kunal's wife suicide

భూమి దేసాయ్‌ కి 28 ఏళ్ళు. ఇమె అహ్మదాబాద్‌ లో ఉన్న సచిన్‌ టవర్స్‌ పది అంతస్తుల భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన కార్‌లో సూసైడ్‌ స్పాట్‌కి వెళ్ళి తన స్నేహితుడు మితేష్‌ కి ఫోన్‌చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. అయితే ఆమె ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుకున్న కారణం ఏంటో ఇప్పటివరకూ తెలియలేదు. భూమి సచిన్‌ టవర్స్‌ కి దగ్గరలో ఉన్న ఆఫీస్‌లో పనిచేస్తుంది. పోలీసులు ఈ విషయం పై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. భూమి రేడియో జాకి గా పని చేస్తున్న కునాల్‌ తో ఒకటిన్నర సంవత్సరాలు డేటింగ్‌ చేసిన తరువాత గత సంవత్సరం నవంబర్‌ లో పెళ్ళి చేసుకుందని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది.

అయితే ఇది భూమికి రెండవ పెళ్ళి. భూమి ఒక ఐ.టి కంపెనీలో పనిచేస్తుంది. భూమి రేడియో చ్యానెల్ నిర్వహించిన పోటీలో బహుమతి గెలుచుకోవడం వల్ల ఆమెకి కునాల్‌ తో పరిచయం ఏర్పడింది.

English summary

Radio Jackie Kunal's wife Bhumi Desai suicides.