నేతాజీ చనిపోలేదని నిరూపిస్తున్న రేడియో ప్రసంగం

Radio Speech That Proves Netaji Was Alive

12:42 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Radio Speech That Proves Netaji Was Alive

ఎన్నో ఏళ్లుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై నెలకొన్న మిస్టరీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఎందుకంటే, నేతాజీ విమాన ప్రమాదంలో మృతి చెందారన్న విషయంలో ఎన్నో వివాదాలున్నాయి. ఇక తాజాగా వినిపిస్తున్న కథనాలు మళ్లీ ఆయన మృతిపై ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. నేతాజీ విమాన ప్రమాదంలో మృతిచెందారన్న వార్త వెలువడిన అనంతరం కూడా నేతాజీ మూడుసార్లు రేడియో ప్రసంగాలు చేశారనే వార్త ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. కేంద్రప్రభుత్వం తాజాగా బహిర్గతపర్చిన నేతాజీ ఫైళ్లలో ఈ విషయం ఉండడంతో దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదం జరిగిన అనేక రోజుల తరువాత నేతాజీ రేడియోలో ప్రసంగాలు చేసినట్లు వెల్లడైంది. ఈ ప్రసంగాల వివరాలు ప్రధాని కార్యాలయానికి చెందిన ఫైల్ నెంబర్ 870/11/పి/16/92/పిఒఎల్ లో ఉన్నాయి.

ఇవి కుడా చదవండి : 'పాతికేళ్ళ నరకం' తలచుకుంటూ  బిగ్ బి విచారం

'బాహుబలి' ఓ చెత్త సినిమా: గుర్వీందర్ సింగ్

1/6 Pages

గవర్నర్ నివేదిక

ఈ సమాచారం బెంగాల్లోని గవర్నర్ నివాసంనుంచి వెలువడినట్లు భావిస్తున్నారు. ఆర్.జి. కాసే గవర్నర్ గా ఉన్న సమయంలో పిసి కార్ అనే అధికారి తమ మానిటరింగ్ సర్వీస్ విభాగం 31 మీటర్ బ్యాండ్ పై ఈ ప్రసంగాలను రావడాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి గవర్నర్  ఒక నివేదికను కూడా సమర్పించారు.

English summary

Radio Speech that was proving that Netaji Subash Chandra Bose was not dead in Aeroplane Accident.Recently Netaji Subash Chandra Bose death mystery files were revealed by the West Bengal Government.In that there were that Netaji Subash Chandra Bose was given speech through Radio three times in 1945 December 26th , 1946 January 1st .