విజయవాడ లయోలా కాలేజీలో కలకలం రేపిన ర్యాగింగ్!

Ragging in Vijayawada Loyola college

12:41 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Ragging in Vijayawada Loyola college

యూనివర్సిటీల్లో, కాలేజీల్లో 'ర్యాగింగ్' అన్న మాట వినపడకుండా చేస్తామని చెబుతున్న ప్రభుత్వాల మాటలు గాలిలో మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటికే 'ర్యాగింగ్' భూతంతో ఎంతో మంది విద్యార్ధులు ప్రాణాలు పోగొట్టుకోగా.. తాజాగా విజయవాడలోని లయోలా కాలేజీలో ర్యాగింగ్ వల్ల మరో విద్యార్థి బలి అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్ చదువుతున్న కమల్ జైన్ అనే విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధించడంతో, మనస్తాపం చెందిన అతను గత రాత్రి హాస్టల్ లో ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సీనియర్లు కమల్ ను నిత్యమూ ఏడిపించేవారని..

అతని సెల్ ఫోన్ లాక్కొని వేధిస్తూ ఉండేవారని తోటి విద్యార్థులు చెబుతున్నారు. కాగా, తమ కాలేజీలో ర్యాగింగ్ జరగలేదని లయోలా యాజమాన్యం చెబుతుండడం విశేషం. దీని పై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary

Ragging in Vijayawada Loyola college