తల్లికి గుడి కట్టిస్తున్న లారెన్స్

Raghava Lawrence building a temple for his mother

05:34 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Raghava Lawrence building a temple for his mother

తొలుత కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన రాఘ‌వ లారెన్స్ ఆ తరువాత నవ మన్మధుడు నాగార్జున తో మాస్ అనే సినిమా తీసి మొదట చిత్రంతోనే ఘన విజయం నమోదు చేసుకున్నాడు. ఆ తరువాత ముని, కాంచ‌న‌, గంగ లాంటి హ‌ర్ర‌ర్ సినిమాల‌తో సౌత్‌లో ఒక్క‌సారిగా పాపుల‌ర్ డైరెక్ట‌ర్‌గా మారిపోయాడు. మంత్రాయ‌లం రాఘ‌వేంద్ర‌స్వామికి భ‌క్తుడు అయిన లారెన్స్‌కు అమ్మ అంటే ఎంతో ఇష్టం. అమ్మ గురించి ఆయ‌న చాలా సంద‌ర్భాల్లో గొప్ప‌గా చెప్పారు. లారెన్స్ అమ్మను ప్రేమించడమే కాదు పూజిస్తున్నారు. తన తల్లికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక గుడిని కట్టిస్తున్నారు.

శ్రీరాఘవేంద్రస్వామి భక్తుడైన లారెన్స్ గతంలో ఆయనకు ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు లారెన్స్ తాను గ‌తంలో నిర్మించిన రాఘవేంద్రస్వామి ఆలయం ఎదురుగా తన తల్లికి గుడి కట్టిస్తున్నారు. దాదాపు నిర్మాణం పూర్తి దశకు చేరుకున్న ఈ గుడికి మరో రెండు నెలల్లో ప్రారంభోత్సవం జరగనుంది. ఆ గర్భగుడిలో ప్రతిష్టించబోతున్న తన తల్లి శిలారూపాన్ని రాజస్థాన్‌లో తయారు చేయిస్తున్నారు. ఆయన కట్టిస్తున్న ఈ గుడిని మాతృదినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ అంకితం చేస్తున్నట్లు దర్శకుడు రాఘవ లారెన్స్ చెప్పారు. లారెన్స్ తన తల్లి పట్లే కాదు ఎప్పుడు ఎవరికి ఏ కస్టం వచ్చినా ముందుండి ఆదుకుంటారు..

English summary

Raghava Lawrence building a temple for his mother. Choreographer come director Raghava Lawrence is building a temple for his mother.