తమిళ 'పటాస్‌' లో లారెన్స్‌

Raghava Lawrence in tamil Pataas

05:53 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Raghava Lawrence in tamil Pataas

నందమూరి కళ్యాణ్‌రామ్‌ నటించిన 'పటాస్‌' 2015 జనవరి లో వచ్చి ఎంత విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే 'హరేరామ్‌' చిత్రం తరువాత సరైన హిట్ కోసం చూస్తున్న కళ్యాణ్‌రామ్‌కి పటాస్‌ మంచి ఊరటనే ఇచ్చింది. అనిల్‌ రావిపూడి అనే క్రొత్త డైరెక్టర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో రిమేక్‌ అవుతుంది మెగా సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ముందు 'రంగం' ఫేమ్‌ జీవాని హీరోగా అనుకున్నా తరువాత రాఘవ లారెన్స్‌ ని ఫైనల్‌గా హీరోగా ఎంపిక చేసారు. అలాగే కాంచన-2లో బాగా పాపులర్‌ అయిన 'ముట్టశివ కెట్టశివ' అనే డైలాగ్‌ని ఈ చిత్రానికి టైటిల్‌గా పెట్టారు. తమిళ నేటివిటికి తగ్గట్టుగాఈ చిత్ర కధను మలిచారు. శ్రీమణి అనే దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఘాటింగ్‌ నిన్నటి నుండే లాంఛనంగా మొదలైంది. కళ్యాణ్‌రామ్‌ పాత్రలో లారెన్స్‌ నటిస్తుండగా, సాయికుమార్‌ పాత్రలో తమిళ నటుడు సత్యరాజ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ని ఇంకా ఎంపిక చేయలేదు.

English summary

Raghava Lawrence in tamil Pataas