మాస్టారి పాత్రలో దర్శకేంద్రుడు...

Raghavendra Rao Filmmaking Classes Starts Today

12:19 PM ON 10th June, 2016 By Mirchi Vilas

Raghavendra Rao Filmmaking Classes Starts Today

కెప్టెన్ కుర్చీలో కూర్చుని వెండి తెరపై రంగుల హరివిల్లు సృష్టించి, ఎందరికో సినీ లైఫ్ ఇచ్చిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఆమధ్య సినిమాల్లో వేషం వేయబోతున్నారని, మేకప్ వేయడమే తరువాయని వార్తలు వచ్చాయి కదా. అయితే అది నిజం కాదని తేలినా, ఇప్పుడు మాస్టారి అవతారం ఎత్తారు. ఇన్నాళ్ళూ ఇండోర్ అవుట్ డోర్ లొకేషన్ లకు పరిమతమైన ఈయన తాజాగా తన లొకేషన్ ను క్లాస్ రూమ్ కి షిఫ్ట్ చేశారు. మెగాఫోన్ స్థానంలో చాక్ పీస్ పట్టుకున్నారు. వెండి తెర ఆయనకు బ్లాక్ బోర్డుగా మారి పోయింది. ఆయన అనుభవాలే పాఠాలయ్యాయి. అవే ఇప్పుడు దారి చూపుతున్నాయి. ఆయన సినీ స్వర్ణోత్సవ ప్రయాణమే సిలబస్ గా మారింది. ఇదంతా సినిమాలో వేషం కాదు సుమా ... నిజంగానే మాస్టారు అయ్యారు. అదేమిటో తెలుసుకుందాం ..

కేఆర్ ఆర్ క్లాస్ రూమ్ పేరిట రాఘవేంద్రరావు దర్శకత్వ పాఠాలు చెప్పడానికి సన్నద్ధమయ్యారు. నవతరానికి ఫిల్మ్ నగర్ లో అడుగుపెట్టడానికి సరికొత్త మార్గం చూపించబోతున్నారు. బహుశా... ఓ దర్శకుడు, క్లాస్ రూమ్ పేరిట, తన సినీ ప్రయాణాన్ని పాఠాలుగా మార్చి బోధిస్తుండడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావచ్చు. పాటల్ని భలే బాగా తీస్తారన్న పేరుతెచ్చుకొన్న దర్శకేంద్రుడు, ఉపాధ్యాయుడిగా పాఠాలెలా చెబుతారన్న ఆసక్తి నెలకొంది. అన్నట్టు... సినిమాపై ఆసక్తి వుంటే చాలట. అదే కేఆర్ ఆర్ క్లాస్ రూమ్ లో అడుగుపెట్టడానికి ఫీజు అంటున్నారు. అడ్మిషన్లు కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆయన పాఠాలు చెప్పేది ఆన్ లైన్ లో ... ఇక ఈ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన తొలి పాఠం చెప్పబోతున్నారు. నటనమీద ఇంట్రెస్ట్ వున్నవాళ్ళు వెంటనే జాయిన్ అయిపోండి మరి .

ఇవి కూడా చదవండి:మొగుడికి-కూతురుకు చెప్పకుండా ఆ నటి రెండో పెళ్లి చేసేసుకుంది

ఇవి కూడా చదవండి:దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుపై ఇనుపరాడ్ తో దాడి

English summary

Director K.Raghavendra Rao was previously announced that he was going to start online acting by his YouTube Channel KRR Class Room and now this calsses to start today at 4 P.M.