తెరముందుకు దర్శకేంద్రుడు!?    

Raghavendra Rao To Act In Movie

03:29 PM ON 9th February, 2016 By Mirchi Vilas

Raghavendra Rao To Act In Movie

తెర వెనక ఉండే దర్శకులు తెర ముందుకు వస్తే, ఆ లుక్కే వేరు. ఇప్పటికే దర్శక రత్న దాసరి నారాయణ రావు, కళా తపస్వి కె.విశ్వనాథ్ లాంటి దిగ్గజాల తొ పాటూ కోడి రామకృష్ణ వంటి మెగా ఫోన్ పట్టుకున్న ఎందరో దర్శకులు కెమెరా ముందుకు వచ్చి అలరించారు. అలరిస్తూనే ఉన్నారు. ఐతే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాత్రం ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా అస్సలు మైకు ముందుకు వచ్చేవారూ కాదు. సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్ళు అయిన సందర్భంగా దరకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్యలహరి పేరిట ఈ టివిలో వచ్చిన ధారావాహిక కార్యక్రమంలో రాఘవేంద్రుడి మాటలు వినే అవకాశం వచ్చింది. ఇక మీడియాతో ఫ్రీగా మాట్లాడేస్తున్నారు. వేదికలెక్కి స్పీచులిస్తున్నారు. ఈ మధ్య దర్శకేంద్రుడిలో వచ్చిన ఈ మార్పుల లో భాగంగా ఇప్పుడిక దర్శకేంద్రుడు నటనలోకి కూడా అడుగుపెట్టేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

శతమానం భవతి పేరుతో రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ‘దొంగల బండి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దీనికి దర్శకుడు. ఇందులో ఓ మంచి పాత్ర ఉందని, దానికి దర్శకుడు రాఘవేంద్రరావు సూటవుతారని దర్శక నిర్మాతలు భావించారట. ఆయన్ని సంప్రచారట. ఐతే రాఘవేంద్రరావు ఏ విషయం తేల్చకుండా స్క్రిప్ట్ చదివి చెబుతానన్నారట. ఐతే దర్శకేంద్రుడికి స్క్రిప్టు కచ్చితంగా నచ్చుతుందని, ఆయన ఈ పాత్ర చేయడానికి అంగీకరిస్తారని ఆశతో రాజు వేగేశ్న వున్నాడు. అయితే ఈ కోరిక రాఘవేంద్రరావు తీరుస్తారేమో చూడాలి.

English summary

Director Raghavendra Rao was going to act ina movie for the first time.He is going to make a movie named Shatamanam Bhavati Movie with Young Hero Raj Tarun and this movie to be directed by Dongala Bandi Movie Fame Sathish Vegnesh.