నాగ్ తో దర్శకేంద్రుని మరో భక్తిరస చిత్రం

Raghavendra Rao To Make Devotional Film With Nagarjuna

11:05 AM ON 8th March, 2016 By Mirchi Vilas

Raghavendra Rao To Make Devotional Film With Nagarjuna

మొత్తానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోబుతున్నాడు. ఇటీవల కాలంలో బాగా గ్యాప్ ఇచ్చిన దర్శకేంద్రుడు ఇటీవలే చలన చిత్ర స్వర్ణోత్సవం కూడా చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఇన్నాళ్ళూ రాఘవేంద్ర రావు మాటలు వినని వాళ్ళందరికీ మాటలు వినే అదృష్టం దక్కింది. ఇక టిటిడి బోర్డు మెంబర్ కూడా అయిన ఇప్పుడు మరోసారి అక్కినేని నాగార్జునతో చిత్రం తీయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అదికూడా భక్తి రస చిత్రమేనట. నాగ్ తో తన తదుపరి చిత్రం తెరకెక్కించనున్నట్లు సోషల్‌మీడియా ద్వారా మహాశివరాత్రి నాడు రాఘవేంద్రరావు వెల్లడించాడు. అదేవిధంగా ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

‘అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ శుభాదినాన నా తదుపరి చిత్రం గురించి మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులుగా నాగార్జునతో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు అని అడుగుతున్నారు. ఇన్నాళ్ళకి కుదిరింది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మా ముగ్గురి కలయికలో అన్నమయ్య, శ్రీ రామదాసు, షిర్డీ సాయి తర్వాత మరో భక్తిరస చిత్రంగా రాబోతోంది. నా ప్రతి సినిమాలానే ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా తిరుపతిలోనే సోమవారం మొదలయ్యాయి. త్వరలోనే షూటింగ్‌ వివరాలు తెలియజేస్తాన’ అని రాఘవేంద్రరావు పోస్ట్‌ చేశారు.

English summary

King Akkineni Nagarjuna and Director Raghavendra rao combo was super hit in the industry and they were famous for their Devotional Films.In past the films like Annamayya,Sri Rama Dasu,Shiridi Sai were made and they were super hit at the box office and now Raghavendra Rao was planning to make another devotional film with Akkineni Nagarjuna.