దర్శకేంద్రుడి ఏ పాఠాలు చెబుతాడో

Raghavendra Rao To Start Online Film Making Classes

10:13 AM ON 26th February, 2016 By Mirchi Vilas

Raghavendra Rao To Start Online Film Making Classes

ఇన్నాళ్లూ మౌనమునిగా ఉన్న దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఓ టీవీ షోలో తన అనుభవాన్నంతా రంగరిస్తూ, మరోపక్క డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉన్నవారికి ఏ రకమైన ఫీజులు చెల్లించనవసరం లేకుండా పాఠాలు నేర్పిస్తానని అంటున్నాడు. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా ఇనిస్టిట్యూట్‌కి వెళ్లే అవసరం కూడా లేదట. కె.ఆర్.ఆర్.క్లాస్ రూమ్..ప్రాక్టికల్ ఇన్ ఫిలిమ్ డైరెక్షన్ అంటూ త్వరలో యూట్యూబ్‌లో దర్శకేంద్రుడు క్లాస్‌లు ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు. ఇందుకు సంబంధిచిన ప్రమోషన్ వీడియో, పోస్టర్‌ తన ఫేస్‌బుక్ ద్వారా దర్సకేంద్రుడు విడుదల చేశారు. ఇన్నాళ్ళూ తన మెగాఫోన్‌తో ఎన్నో సూపర్‌హిట్‌లు తెరకెక్కించి ఎందర్నో సూపర్ స్టార్లుగా తీర్చిదిద్ది, ఎందరో భామలను సుందరాంగులుగా మలిచిన రాఘవేంద్రరావు తాజాగా వీడియో క్లాస్‌లతో టాలీవుడ్‌కి మరింత మంది దర్శకులు పరిచయమయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఏదైనా మాట్లాడామంటే.. ఆ విషయం అవతలి వ్యక్తికి ఉపయోగపడాలే ఉండాలనుకునే దర్శకేంద్రుడు ఏ రకమైన పాఠాలు చెప్పబోతున్నాడో. పాటలలో పూలు , పళ్ళు విస్తృతంగా వినియోగించిన దరకేంద్రుడు ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లకు ఇన్‌స్పిరేషన్‌గా ఏం ఉపయోగించమని చెబుతారో మరి .

English summary