అబ్బో, ఈయన అంత తేలిగ్గా పడతాడా?    

Raghavendra rao Was Not Acting in Satamanam Bhavati Movie

12:49 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Raghavendra rao Was Not Acting in Satamanam Bhavati Movie

దర్శకేంద్రుడు అంటే, ఆషామాషీ కాదు, సినిమాకు కమర్షియల్ హంగులు అద్ది , తారలను పువ్వులతో , పండ్లతో కొట్టిస్తూ, ఎందరినో నాభి సుందరిగా మలచిన దర్శక దిగ్గ జం కె.రాఘవేంద్రరావు అని వేరే చెప్పక్కర్లేదు. ఈయన మాట్లాడ్డమే బహు తక్కువ. సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరి ప్రోగ్రాం వరకూ ఈయన గొంతు వినని వాళ్ళు ఎందరో వున్నారు. ఎందరినో నట శిఖరాలు అధిరోహింప చేసిన, దర్శకేంద్రుడు స్వయంగా ఓ చిత్రంలో నటిసున్నట్లు వార్తలు వచ్చాయి. అబ్బో ఇంకేముంది అనుకున్నారు అంతా....కానీ సీన్ రివర్స్ అయింది.

శతమానం భవతి అనే టైటిల్ తో సినిమా నిర్మించేందుకు దిల్ రాజు గతంలోనే నిర్ణయించుకున్నాడు. సతీష్ వేగ్నేశను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. మెగా సుప్రీం స్టార్ సాయిధరం తేజ్ తో ఈ సినిమా తీయాలని అనుకున్నారు. కానీ ఈ మూవీలో సాయి ప్లేస్ లోకి కొత్త కుర్రాడు రాజ్ తరుణ్ వచ్చి చేరాడు. త్వరలో హీరోయిన్ ని ఫైనలైజ్ చేసి శతమానం భవతిని సెట్స్ పైకి తీసుకెళ్లాలని దిల్ రాజు భావిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు రాఘవేంద్రరావు సరే అన్నారనే వార్తల కారణంగా.. చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది.ఆ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడీ వార్తలన్నీ రూమర్స్ అని తేలిపోయింది. అసలు రాఘవేంద్రరావును రోల్ కోసం సంప్రదించలేదని చెబుతోంది యూనిట్. మరి ఎందుకు ఈ రూమర్స్ వచ్చాయి. అయినా ఈ పెద్దాయన అంత గమ్మున ఒప్పుకుంటాడని ఎలా అనుకుంటాం.

English summary

Recently a rumor came that movie legend Raghavendra Rao to make film debut in Satamanam Bhavati Movie.But this film unit was opposed that rumors on that Raghavedra Rao acting in the movie.Young hero Raj Tarun was acting as hero in this movie.