ఎట్టెట్టా.. జగన్ పార్టీ కరుగుతున్న ఐస్ క్రీమా!!

Raghuveera Reddy shocking comments about Jagan party

01:31 PM ON 19th July, 2016 By Mirchi Vilas

Raghuveera Reddy shocking comments about Jagan party

ఒక్కోసారి నాయకులు ఇచ్చే స్టేట్ మెంట్లు చూస్తే, సినిమాల్లో పంచ్ డైలాగులు ఎందుకూ పనికిరావు. అదే రీతిలో కాంగ్రెస్ ఏపీ రద సారధి ఎన్ రఘువీరా రెడ్డి ఇచ్చిన పంచ్ డైలాగ్ అదిరింది. అదికూడా వైఎస్ జగన్ పార్టీ గురించి. ఎందుకంటే చాలామంది ఆపార్టీ వైపు చూస్తున్న నేపథ్యంలో ఇచ్చిన కిక్కు డైలాగ్ అదిరిందని అంటున్నారు. వైసీపీ కరిగిపోతున్న ఐస్ క్రీమ్ లాంటిది. ఆ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు కార్యకర్తలూ మిగలరు. వైఎస్ సెంటిమెంట్ మాత్రమే ఆ పార్టీకి బలం.తండ్రిని తిట్టినవారిని జగన్ ముందువరసలో కూర్చోబెట్టారు. ప్రజలు ఎలా నమ్ముతారు అంటూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పంచ్ డైలాగులతో ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే సత్తా వైసీపీకి లేదన్నారు. ఆ పార్టీకి అసలు ప్రజా సమస్యలపై ఎజెండానే లేదన్నారు. జగన్ పార్టీ అందుకు భిన్నంగా వ్యక్తిపూజతో ముందుకెళ్తోందని, వైఎస్ పేరు చెప్పుకొంటూ ఆయన ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తోందని, రాజ్యసభ సభ్యుడిని గెలిపించుకొనేందుకు సొంతపార్టీ ఎమ్మెల్యేలకే డబ్బులిచ్చిన ఘనత ఒక్క వైసీపీకే దక్కుతుందని రఘువీరా ఎద్దేవా చేశారు. జగన్ సీఎం అయ్యేందుకే లక్ష్మణ రేఖ(కాంగ్రెస్ ను వీడడం) దాటారని, మూడు సార్లు సీఎం పదవి ఇవ్వకపోయినా వైఎస్ ఎన్నడూ పార్టీని వీడలేదని రఘువీరా గుర్తుచేశారు.

పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని వైఎస్ కు ఆయన సోదరుడు వివేకానందరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం నిరాకరించి.. వైఎస్ పురుషోత్తమరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఆయన్ను గెలిపించి కాంగ్రెస్ పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్న వ్యక్తిత్వం వైఎస్ సొంతమని చెప్పారు. ఏ పార్టీ నుంచి ఎవరొచ్చినా చేర్చుకోండని చంద్రబాబు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ తమ శ్రేణులకు చెబుతుంటే ఆ రెండు పార్టీలనూ ఏమీ చేయలేని జగన్.. కాంగ్రెస్ నేతల ఇళ్ల చుట్టూ తన నేతలను పంపుతున్నారని మండిపడ్డారు. ఈ మూడు పార్టీల నేతలు ఎంగిలి కూడు తినే దద్దమ్మలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చి రాహుల్ ను ప్రధాని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.

English summary

Raghuveera Reddy shocking comments about Jagan party