అక్కా తమ్ముడు దూకుడు..

Rahul and Priyanka Gandhi Election Campaign in UP

11:27 AM ON 13th July, 2016 By Mirchi Vilas

Rahul and Priyanka Gandhi Election Campaign in UP

కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించడానికి కసరత్తు స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా ఇక మీదట అక్కాతమ్ముడు కలిసి దూకుడు ప్రదర్శించనున్నారు. త్వరలో జరగబోయే యుపి ఎన్నికల్లో ప్రచారానికి రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక వధేరా రాబోతోంది. కొంతకాలంగా యుపి ఎన్నికల ప్రచారానికి ప్రియాంక రావాలని కాంగ్రెస్ లోని ఓ వర్గం గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో రాహుల్ ని పక్కనపెట్టామన్న సందేశం వెళ్తుందన్నది మరో వర్గం ఆర్గ్కుమెంట్ చేస్తూ వస్తోంది. అయితే ఈ రెండు వాదనలు విన్న అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర కసరత్తు చేసి, మొత్తానికి ఓ పరిష్కారం చూపారు. దీని ప్రకారం ఇద్దరూ చెరో వైపు నుంచి ప్రచారంలో చెలరేగి పోతుంటే, భలే ఉంటుందని, శ్రేణుల్లో జవసత్వాలు వస్తాయని అంటున్నారు.

ఇదిలా ఉండగా, దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోన్న కాంగ్రెస్ ఇప్పటికే బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ ను ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (యూపీసీసీ) అధ్యక్షుడిగా నియమించింది. యూపీ కాంగ్రెస్ ఇన్ చార్జి గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బబ్బర్ నియామకాన్ని వెల్లడించారు. అంతేకాదు ప్రియాంక ప్రచారం గురించి క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అక్కా తమ్ముడు కల్సి సాగించే ప్రచారంతో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వచ్చేనా!

ఇవి కూడా చదవండి:చిన్నారిని గద్ద తన్నుకుపోతుంటే...(వీడియో)

ఇవి కూడా చదవండి:ఫేస్ బుక్ లో చాటింగ్.. హోటల్లో గడిపారు .. ఆతర్వాత ఏమైందో తెలిస్తే షాకవుతారు

English summary

Congress Party started to bring old legacy to Congress party in India and recently Rahul Gandhi and Priyanka Gandhi also decided to participate the election campaign in upcoming Uttar Pradesh elections.