సెంచరీ కొట్టిన జూనియర్‌ ద్రవిడ్‌

Rahul Dravid Son Hits Century In Under 14 Cricket

10:50 AM ON 22nd April, 2016 By Mirchi Vilas

Rahul Dravid Son Hits Century In Under 14 Cricket

రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు సమిత్‌ దూసుకుపోతున్నాడు. 10 ఏళ్ల సుమిత్‌ పాఠశాల క్రికెట్లో సత్తా చాటడం ద్వారా తండ్రి బాటలో నడుస్తున్నాడు. ‘‘సమిత్‌ ప్రస్తుతం బానే ఆడుతున్నాడు. కంటి, చేయి సమన్వయం బాగుంది. అతనికి ప్రతిదీ పట్టుబట్టి నేర్పించాలని అనుకోవట్లేదు. సమిత్‌కు క్రికెట్‌ మాత్రమే కాదు ఫుట్‌బాల్‌, స్విమ్మింగ్‌ క్రీడల్లో కూడా ప్రావీణ్యం ఉంది’’ అని ఒక సందర్భంలో ద్రవిడ్‌ పేర్కొన్నాడు. తాజాగా అండర్‌-14 టైగర్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీలో బెంగళూరు యునైటెడ్‌ క్రికెట్‌ క్లబ్‌ (బీయూసీసీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న సమిత్‌... ఫ్రాంక్‌ ఆంథోని పబ్లిక్‌ స్కూల్‌ పై 125 పరుగులు చేశాడు. సమిత్‌ సెంచరీలో 12 బౌండరీలున్నాయి. ఇన్నింగ్స్‌లో అతను రెండో అత్యధిక స్కోరర్ . అతని సహచరుడు ప్రత్యూష్‌ అజేయంగా 143 పరుగులు చేశాడు. సమిత్‌-ప్రత్యూష్‌ జోడీ శతకాలతో బీయూసీసీ 246 పరుగుల తేడాతో ఫ్రాంక్‌ ఆంథోని పై ఘన విజయం సాధించింది. సమిత్‌ ఇలా భారీ స్కోరు చేయడం ఇదేం తొలిసారి కాదు. ఎందుకంటే, గతేడాది గోపాలన్‌ క్రికెట్‌ ఛాలెంజ్‌ టోర్నీలో ఈ జూనియర్‌ ద్రవిడ్‌ అండర్‌-12 విభాగంలో 77 నాటౌట్‌, 93, 77 స్కోర్లు చేసి ‘ఉత్తమ బ్యాట్స్‌మన్‌’ అవార్డు అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

ఆ రెస్టారంట్ లో నగ్నంగా కూర్చుని తినొచ్చట

రణ్‌వీర్‌సింగ్‌,వాణీకపూర్‌ ముద్దులే ముద్దులు

ఫోర్జరీ సంతకాల కేసులో టివి నటికి మూడేళ్ల జైలు శిక్ష

English summary

Indian Cricket Legend Mr.Depandable Rahul Dravid son Samit Scores a Century in Under-14 Cricket. Rahul Dravid Says that he will forced his son to play cricket and Dravid also says that his son was also good at Foot Ball and Swimming.