టీమిండియా కోచ్‌గా ద్రవిడ్‌ !

Rahul Dravid To Be Appointed As India Coach

11:54 AM ON 4th April, 2016 By Mirchi Vilas

Rahul Dravid To Be Appointed As India Coach

టీమిండియా కోచ్‌గా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ రాబోతున్నాడా? అవుననే సంకేతాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. కోచ్‌ ఎంపిక బాధ్యతను బీసీసీఐ ఇప్పటికే సచిన్‌ టెండుల్కర్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీకి అప్పగించింది. ప్రస్తుతం భారత్‌ జట్టుకు ప్రధాన కోచ్‌ అంటూ ఎవరూ లేకపోయినా డైరెక్టర్‌ హోదాలో రవిశాస్త్రి పర్యవేక్షిస్తున్న సంగతి తెల్సిందే. అయితే టీ20 ప్రపంచకప్‌ అనంతరం రవిశాస్త్రితో కుదుర్చుకున్న ఒప్పందం ముగుస్తుండటంతో కమిటీ కోచ్‌ అన్వేషణలో పడింది. కొద్ది రోజుల ముందు వరకూ కోచ్‌గా ఆసీస్‌ మాజీ క్రికెటర్లు షేన్‌ వార్న్‌, మైకెల్‌ హస్సీ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చినా కమిటీ చివరకు ద్రవిడ్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌ నుంచి సుమారు 15 టెస్టు మ్యాచ్‌లను భారత్‌ జట్టు ఆడనున్న నేపథ్యంలో టెస్టు ఫార్మాట్లో అపార అనుభవం ఉన్న ద్రవిడ్‌ కోచ్‌గా ఉంటే లబ్ధి చేకూరుతుందన్న అంచనాకు కమిటీ వచ్చిందని అంటున్నారు. ద్రవిడ్‌ ప్రస్తుతం భారత్‌ ఎ, అండర్‌-19 జట్టుకు కోచ్‌గా, ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ఇవి కుడా చదవండి :

సన్నీలియోన్ తో బాలయ్య సెంచరీ

'ఊపిరి' నిర్మాతలు మోసం చేసారు:రాజా రవీంద్ర

సన్నితో నటించాలని ఉంది

ప్రియాంక చోప్రా ఆత్యహత్యాయత్నం

English summary

Veteran Batsmen Rahul Dravid to be appointed as as a Chief Coach for the Indian Cricket Team.At Present he was working as Coach For India Under -19 team and India -A team.