తప్పులో కాలేసిన రాహుల్ 

Rahul Gandhi again mistaken

11:29 AM ON 19th January, 2016 By Mirchi Vilas

Rahul Gandhi again mistaken

ఏదో మాట్లాడాలని మరేదో మాట్లాడే అలవాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధికి బానే వుంది. అందుకే తరచూ తప్పులో కాలేస్తుంటాడు. తాజా గా మరో సారి నోరు జారి నవ్వుల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే, జనవరి 16న ముంబైలోని నర్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎన్ఎన్ఐఎమ్ఎస్)లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరయ్యారు. విద్యార్ధులను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో జీఎస్టీ బిల్లు ప్రస్తావన తీసుకొచ్చారు. తమ డిమాండ్లను బీజేపీ అంగీకరిస్తే కేవలం 15 నిమిషాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు.

ప్రజా ప్రయోజన డిమాండ్లు అంగీకరించేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు.అందుకే జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం లేదని ఆయన స్పష్టం చేశారు. అక్కడితో ఊరుకుంటే బానే వుణ్ను. కానీ ఇంతలోనే ఒక్కసారిగా ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సరిగ్గా అదేసమయంలో ఒకటి చెప్పబోయి మరోటి చెప్పి, ఇరకాటంలో కాదు , కాదు నవ్వుల పాలయ్యారు. 'ఏదో ఒకరోజు మీరూ ఈ దేశంలో అద్భుతమైన కంపెనీలను నెలకొల్పుతారు , మైక్రోసాప్ట్‌ను స్టీవ్‌జాబ్స్ ఎలాగైతే నెలకొల్పారో అలాగే' అనడంతో ఒకటే నవ్వులు. ఇంతకీ మైక్రిసాఫ్ట్ ఎవరు నెలకొల్పారో కూడా తెలీదా ఇతనికి.

అందుకే చేతన్ భగత్ తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు ఎక్కువ జోకులు వేసే వ్యక్తి ఎవరంటే రాహుల్ గాంధీ అని తడుముకోకుండా ఠక్కున సమాధానం చెప్పేస్తారు. ఇకనైనా చెప్పేదేదో కరెక్ట్ గా చెబితే మంచిదని అంతా అనేమాట.

English summary

Rahul Gandhi again did mistake with his unknown words. 2 days before he went to Monjee Institute Of Management Studies.