ఆహ.. రాహూల్ పెళ్ళంట!

Rahul Gandhi marriage

02:34 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Rahul Gandhi marriage

అవును ఈ వార్త నిజంగా కాంగ్రెస్ శ్రేణులకు యమ ఖుషీగానే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, గెడ్డం కూడా నెరిసిపోయిన నవ యువకుడు రాహుల్ గాంధీకి ఇంకా పెళ్లి కాలేదని బెంగ పెట్టుకున్న కార్యకర్తలు ఎందరో ఉన్నారట. మరి రాహూల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడా? ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో విపరీతమైన హల్ చల్ చేస్తూ, చర్చకు దారితీస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందే.. ఆ రాష్ట్రానికి చెందిన ఒక బ్రాహ్మణ యువతిని రాహుల్ పెళ్లి చేసుకోబుతున్నాడంటూ బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి చేసిన ట్వీట్ ఒక్కసారిగా సోషల్ మీడియాను ఊపేసింది.

అయితే.. తాను కొన్ని వర్గాల నుంచి విన్నానని, యూపీ ఎన్నికల కోసం యూపీ బ్రాహ్మణ అమ్మాయిని బుద్ధూ పెళ్లిచేసుకోవచ్చని స్వామి తన ట్వీట్లో ప్రస్తావించారు. ఇది కూడా ఎన్నికల స్టంటే కావొచ్చని కూడా అనేసారు. అయితే ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు కాంగ్రెస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ రణదీప్ సుర్జేవాలా నిరాకరించారు. అయితే యూపీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇది నిరాధారమైన వదంతిగా కొట్టిపారేశారు. అయితే.. సుబ్రమణ్యం స్వామి కూడా తర్వాత తన ట్వీట్ గురించి మరింత స్పష్టత ఇస్తూ, సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తున్నాడన్నది ఎంత నిజమో, రాహుల్ పెళ్లి విషయం కూడా అంతే నిజమన్నారు.

తాను కావాలనే కొన్ని వర్గాల ద్వారా ఈ విషయం సేకరించామని అంటున్నారు. కాగా వచ్చే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ పరువును తీసేయడానికే డాక్టర్ స్వామి ఇలాంటి రూమర్స్ పుట్టిస్తున్నారని యూపీ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. 2015లో రాహుల్ గాంధీ ఫ్రాన్స్ వెళ్లినప్పుడు కూడా ఆయన ఇటలీలో స్థిరపడిన ఆఫ్ఘాన్ ముస్లిం యువతితో కనిపించారని స్వామి అప్పట్లో చెప్పారు. అలాగే, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయినప్పుడు కూడా స్వామి తన ట్వీట్లతో ఎద్దేవా చేశారు. అఖిలేష్కు, బుద్ధూకు మధ్య తేడా ఏంటో తెలుసా? అ

ఖిలేష్ వయసు 38 ఏళ్లు, అతడికి ముగ్గురు పిల్లలున్నారు. రాహుల్ వయసు 42 ఏళ్లు, అతడింకా పిల్లాడే అన్నారు. 2015లో రాహుల్ గాంధీ అమేథీలోని ఏహెచ్ ఇంటర్ కాలేజి స్కూలుకు వెళ్లినప్పుడు అక్కడి విద్యార్థి మహ్మద్ అన్వర్ కూడా పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలూ తీరుతాయని, త్వరగా పెళ్లి చేసుకోవాలని రాహుల్ను కోరారు. ఇది ఏమయినా రాహూల్ పెళ్లంటే నిజంగా కాంగ్రెస్ వారికి పండగే కదా.

English summary

Rahul Gandhi marriage