అర్జునితో పోలుస్తూ రాహుల్ పోస్టర్

Rahul Gandhi Was Compared With Arjuna In A Poster In UP

10:53 AM ON 13th September, 2016 By Mirchi Vilas

Rahul Gandhi Was Compared With Arjuna In A Poster In UP

వచ్చే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో అధికారం హస్త గతం చేసుకోవడమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కీర్తిస్తూ కాంగ్రెస్ నేతలు రూపొందించిన పోస్టర్ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మత్స్యయంత్రంపై బాణం సంధిస్తున్న అర్జునుడిలా ఉన్న రాహుల్ పోస్టర్ ను గురువారం అలహాబాద్ రోడ్ షోలో ఇద్దరు యువ కాంగ్రెస్ నేతలు ప్రదర్శించారు. అంతేకాదు యుగపురుషుడు అంటూ రాహుల్ ను కీర్తించారు.

ఈ పోస్టర్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కిసాన్ యాత్ర ప్రచారంలో భాగంగా గురువారం అలహాబాద్ కు చేరుకున్న రాహుల్ కు స్వాగతం పలికిన నేతలు ఆయనను యుగపురుషుడు అని కీర్తిస్తూ, అర్జునుడి రూపంలో ఉన్న రాహుల్ పోస్టర్ ను ప్రదర్శించారు. ఈ పోస్టర్ ను అహ్మద్, దూబే అనే కాంగ్రెస్ నేతలు తయారుచేయించినట్టు తెలుస్తోంది. ఈ పోస్టర్ గురించి తనకు తెలియదని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు అనడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: ఇరు రాష్ట్రాల్లో 'కావేరీ' రివర్ వార్ (వీడియో)

ఇవి కూడా చదవండి:ఎయిడ్స్ వ్యాధిని జయించిన యోధుడు!

English summary

Uttar Pradesh state Assembly elections dates was coming near and all political parties in UP were busy with their election campaign. Recently congress party leaders made an poster and that Rahul Gandhi was Compared with Lord Arjuna and this became controversial over there in UP.