కలతలు లేని కాపురంలో విడాకుల గొడవ

Rahul Ravindran is acting as a lawyer in Sobhan Babu movie

10:28 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Rahul Ravindran is acting as a lawyer in Sobhan Babu movie

'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ లో రాహుల్ రవీంద్రన్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక గతేడాది ప్రిన్స్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ 'శ్రీమంతుడు' సినిమాలో కూడా ఓ రోల్ లో నటించిన రాహుల్ రవీంద్రన్ కు ఇటీవల సింగర్ చిన్మయితో వివాహం జరిగింది. వీరు హ్యాపీగా కాపురం కూడా చేసుకుంటున్నారు. ఎలాంటి కలతలు లేనే లేవు. అలాంటి వారి మధ్య విడాకుల గొడవ వచ్చింది. లాయర్ దాకా వెళ్లారు. రాహుల్ రవీంద్రన్ విడాకుల లాయర్ వద్దకు వెళ్లింది నిజమైనా, అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేమంటే, రాహుల్ తాజాగా 'శోభన్ బాబు' చిత్రంలో నటిస్తున్నాడు.

ఇందులో విడాకుల లాయర్ గా ఓ విభిన్నమైన పాత్రను రాహుల్ రవీంద్రన్ పోషిస్తున్నాడు. మరి రాహుల్ కేరీర్ ను ఈ విడాకుల లాయర్ రోల్ ఎలా టర్న్ చేస్తుందో గానీ, ఈ సినిమాతో రాహుల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాలో నేను విడాకులు ఇప్పించే లాయర్ పాత్ర పోషిస్తున్నా. కానీ నా పాత్ర ముగ్గురు అమ్మాయిల మధ్య నలుగుతూ ఉంటుంది. వారి మధ్య ఈ పాత్ర ఎలాంటి ఒడ్డుకు చేరిందన్నదే అసలు పాయింట్. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. నాకు తప్పకుండా పేరు తెస్తుంది అని రాహూల్ ధీమా వ్యక్తం చేశాడు. అదండీ విడాకుల గొడవ.

English summary

Rahul Ravindran is acting as a lawyer in Sobhan Babu movie