రైలు పట్టాలమీద మరణాలు తక్కువ కాదండోయ్  

Railway Accident Incidents Rise In India

07:18 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Railway Accident Incidents Rise In India

సమకాలీన పరిస్థితుల్లో రైలు ప్రమాదాలు ఎక్కడో అక్కడ చూస్తున్నాం , వింటున్నాం. రైలు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. అందుకే రైల్వే శాఖ పనితీరుపై పెద్ద ఎత్తున చర్చే ఉంటూ వుంటుంది. వాస్తవానికి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది, అవి ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తున్నాయి వంటి విషయాలను లోక్ సభలో ప్రభుత్వం ప్రకటించింది.

రైల్వే శాఖ మొత్తం ప్రమాదాలను లేక్కతీస్తే , గణాంకాలు బయటకు వచ్చాయి. అబ్బో ఇన్ని ప్రమాదాలా , ఇంతమంది పోయారా అన్పించక మానదు. ఇంతకీ విషయానికొస్తే ,పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి లోక్ సభ లో లిఖిత పూర్వకంగా ఇచ్చిన వివరాల ప్రకారం గడిచిన మూడేళ్ల వ్యవధిలో రైలు ప్రమాదాల ను వివరించారు. ఈ లెక్కల ప్రకారం దేశంలో 81వేల మంది రైలు ప్రమాదాల్లో మరణించారు.

వివరాలోకి వెళితే , 2012 సంవత్సరంలో రైలు పట్టాలపై 16336 మరణాలు సంభవిస్తే , 2013లో ఆ సంఖ్య 19 997 గా వుంది. ఇక 2014లో రైలు పట్టాలపై మరణించిన వారి సంఖ్య 24.393 గా నమోదైంది. ఈ ఏడాది నవంబర్ వరకూ 20 వేల 312 మంది మరణించారు. మొత్తంగా 2012 నుంచి ఇప్పటి వరకూ దేశంలో రైలు పట్టాలపై 81వేల మంది మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందట. రైల్వే గేట్ల వద్ద కాపలా పెట్టడం , అలారం తదితర ఏర్పాట్లు చేస్తున్నారట.

English summary

Train Accidents were rising in India. Since last three years almost 81 thousand people were died in trail accident in India