మళ్లీ 'రైల్వే' బాదుడు..!

Railway Charges To Rise Up

03:59 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Railway Charges To Rise Up

మళ్లీ రైల్వే చార్జీల బాదుడుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైల్వే వార్షిక బడ్జెట్‌లో కేంద్రం రూ.12,000 కోట్లు కోత పెట్టడంతో ఆదాయ మార్గాల కోసం రైల్వే శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ఏ మార్గం దొరక్కపోతే ఆ భారాన్ని ప్రజలపైనే రుద్దడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆదాయ మార్గాలను స్వయంగానే అన్వేషించుకోవాలని రైల్వే శాఖకు ఆర్థిక శాఖ సూచించింది. అయితే ప్రయాణికులు, సరకు రవాణా ధరలు పెంచడం ద్వారానే అది సాధ్యమవుతుంది. సరుకు రవాణా ప్రధానంగా సాగే మౌలిక రంగాలైన బొగ్గు, స్టీల్‌, సిమెంట్‌ ఉత్పత్తి బాగా తగ్గడంతో వాటి మీద ఆధారపడే పరిస్థితి లేదు. దీంతో ప్రయాణికులపై ఛార్జీల భారాన్ని మోపనున్నట్లు రైల్వే వర్గాలు చెపుతున్నాయి. రైల్వే బడ్జెట్‌ను పూర్తిగా విడుదల చేయాలని ఆర్థిక శాఖకు విన్నవించామని, దానిపై సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంటున్నాయి. ఇటీవలే రైల్వే శాఖ తత్కాల్‌ ఛార్జీలను 33 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే.

English summary

Government of India to increase railway charges again.Finance ministry’s recent decision to cut gross budgetary support to railways ministry by Rs.12,000 crore,