జాట్ ల ఆందోళనతో అపార నష్టం

Railway Losses 200 crores due to Jat agitation in Haryana

02:47 PM ON 20th February, 2016 By Mirchi Vilas

Railway Losses 200 crores due to Jat agitation in Haryana

సాధారణంగా ప్రకృతి వైపరీత్యాల వలన భారీ నష్టం వాటిల్లే పరిస్థితులు వుంటే , ఇక ఉద్యమాల వలన వందల కోట్ల రూపాయల నష్టం వాట్టిల్లుతోంది. తాజాగా ఓబీసీ కేటిగిరిలో జాట్‌లకు రిజర్వేషన్‌ కల్పించాలని గత కొద్ది రోజులుగా జాట్‌ కులస్థులు హరియాణాలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. గతకొంతకాలంగా కొనసాగుతున్న జాట్‌ ల ఆందోళనల వల్ల రైల్వే శాఖకు 200కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ చెబుతోంది. ఆందోళనకారుల వల్ల దాదాపు 600 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని, ఫిబ్రవరి 15 నుంచి ఇప్పటివరకు 124 ప్యాసింజర్‌, 500 గూడ్స్‌ రైళ్లపై ఆందోళన ప్రభావం పడిందని అధికారులు వెల్లడించారు దీంతో చాలా మంది ప్రయాణికులు వారి ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో రైల్వేకు 200కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నారు. ఇక శుక్రవారం వారి ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్రమంత్రి నివాసానికి నిప్పంటించి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. దీంతో రోహతక్‌, భీవానీ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. కాగా జాట్‌ల ఆందోళనల కారణంగా విశాఖ- అమృత్‌సర్‌ మధ్య నడిచే హిరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆగిపోయింది. విశాఖ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరాల్సిన ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలును అధికారులు నిలిపేశారు.

English summary

Due to Disruptions caused by the ongoing Jat quota stir in Haryana have caused a loss of Rs. 200 crore to the railways as the schedules of more than 600 passenger and freight trains were hit.SDue to that soo many trains were cancelled and the financial loss so far due to cancellation of passenger trains and disruption of freight service is about Rs. 200 crore.