రైల్వేశాఖమంత్రి ఎంత మంచోడో

Railway Minister Helps To Child In The Train

10:34 AM ON 12th December, 2015 By Mirchi Vilas

Railway Minister Helps To Child In The Train

కేంద్ర రైల్వేశాఖమంత్రి సురేష్‌ ప్రభు ఆకలితో అలమటిస్తున్న 5 సంవత్సరాల చిన్నారి ఆకలి తీర్చాడు. వివరాల్లోకి వెళ్తే అవినాష్‌ అనే 5 సంవత్సరాల చిన్నారి తన తల్లితో కలిసి మధురై నుండి న్యూఢిల్లి కి ఒక ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. మంచు ఎక్కువగా కురుస్తున్నందున వారు ప్రయాణించే రైలు ఆలస్యంగా ప్రయాణించింది. దీంతో ఆ చిన్నారికి ఆకలి వెయ్యడంతో బోరున విలపించడం మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని బాలుడి తల్లి తన భర్తకు చెప్పడంతో అతను కేంద్ర రైల్వేశాఖమంత్రి సురేష్‌ప్రభు కి ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు.

ట్విట్టర్లో ట్వీట్‌కు స్పందించిన సురేష్‌ ప్రభు వెంటనే అక్కడ రైల్వే అధికారులను బాలుడికి పాలు అందేలా చూడమని ఆదేశాలు జారీ చేసారు. మంత్రి ఆదేశాలకు స్పందించిన రైల్వే శాఖా అధికారులు బాలుడికి ఆహారం, పాలను, బిస్కెట్లను అందజేశారు. దీంతో ఎంతో సంతోషంగా బాలుడి తల్లిదండ్రులు రేల్వేవారికి కృతజ్ఞతలు తెలిపారు. నిజంగా ఒక కేంద్ర మంత్రి అయ్యుండి కుడా ఈ విధంగా సామాన్య ప్రజలకు సహాయ పడడం అభినందనియం.

English summary

Indian Railway Minister Suresh Prabhu Helps to a 5 year old child by responding to the tweet made by child father