ఈ రైలు అదుర్స్‌

Railway offers a homely feeling to passenger

05:23 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Railway offers a homely feeling to passenger

రైల్వేశాఖ వారు 2011లో ఒక ప్రాజెక్ట్‌ ని మొదలు పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌ ఇప్పుడు మేక్‌ ఇన్‌ ఇండియా నినాధంతో ఊపందుకుంది. రైల్వేశాఖ వారు ప్రయాణికులకు 'హోమ్‌లీ' భావన కలగాలని, అలాంటి వాతావరణాన్ని కల్పించే విధంగా రైలు ని తయారుచేసారు. ఈ రైలు 5 స్టార్‌ హోటల్‌ ని తలపించేలా ఉంటుంది. 2015 లో ఈ రైలు పూర్తిగా అదునాతన పద్ధతిలో తీర్చిదిద్దబడింది. ఇది చూడడానికి చాలా మనోహరంగా ఉంటుంది.

రైలులో 24 కోచ్లు ఉన్నాయి. ఈ రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలియజేసారు. అదే విధంగా ఇది ట్రైల్ రన్ కోసం భూపాల్‌, బీనా మధ్యగా దీన్ని నడపడం జరిగింది. సిఆర్‌డబ్ల్యూ వారి రూపకల్పనకి ఈ రైలు నిదర్శనం. దీనిని ఎంతో అద్బుతంగా నిర్మించారు.

100 కోచ్లు నిర్మించాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. 87 నాన్‌ ఎసి, 17 ఎసి 3-టైర్‌, 5 ఎసి 2-టైర్‌ ఇవి ఒక్కొకటి ఫస్ట్‌క్లాస్‌ మరియు ఎసి చైర్‌కార్‌. ఎసి, స్లీపర్‌ కోచ్లు నిర్మించడానికి దాదాపు ఐఎన్‌ఆర్‌ 70 మరియు 49 లక్షలు ఖర్చువుతుంది అని తెలిపారు.

అద్బుతమైన ఇంటీరియర్ అలంకరణ:

1. విశాలమైన సీట్లు: ఇవి ఎంతో అందంగా కుదుపులు లేకుండా, అసలు ప్రయాణం చేస్తున్నట్లు మీకు భావన కలుగకుండా చూసుకుంటాయి

.

2. మిడిల్‌ బెర్త్‌: గొలుసులకు బదులుగా రైలింగ్‌ వేసారు. దీనివల్ల గొలుసుల మాదిరిగా గీరుకోకుండా ఉంటుంది. మిడిల్‌ బెర్త్‌ని వాడుకోవడానికి అప్పర్‌బెర్త్‌కి గొలుసు సహాయంతో కలుపుతారు.దానివల్ల అప్పుడప్పుడు ప్రమాదం జరుగుతుంది. దీనిలో అటువంటి ప్రాబ్లమ్‌ లేదు.

3. కార్పెట్‌ లాంటి పెయింట్‌: ట్రైన్‌లో కార్పెట్‌ పరిచారేమో అనిపించేలా ఉంగుంది.ఆ పెయింటింగ్‌ అచ్చం కార్పెట్‌ మాదిరిగా అందంగా ఉంటుంది.

4. టాయిలెట్లు: అన్ని కోచ్లలో బయోటాయిలెట్లను నిర్మించారు. ఎక్కడికక్కడ పైప్స్‌ ని ఫిక్స్‌ చేసారు. చూడడానికి చాలా చక్కగా అగుపిస్తాయి.

5. ఎల్‌ఇడి లైట్లు: చార్జింగ్‌ పాయింట్లు ప్రతి కోచ్‌లోనూ ఉండేలా నిర్మించారు. అంతే కాకుండా మొబైల్‌ ఫోన్‌ కి, లాప్‌టాప్‌లకు వేర్వేరుగా చార్జింగ్ పాయింట్స్‌ అమర్చారు. రైలు బోగి లో ఎక్కడ చూసినా ఎల్‌ఇడి లైట్లతో కనువిందుగా కనిపిస్తుంది.

6. ఫైర్‌ ఎక్ట్సింగ్విషర్స్‌: అగ్నిప్రమాదాలు సంభవిస్తే వాటిని నివారించడానికి ఫైర్‌ ఎక్ట్సింగ్విషర్స్‌ కూడా కోచ్‌ చివరన అమర్చారు.

English summary

Railway offers a homely feeling to passenger. The plan was to ditch the boring and primeval design by bringing about magnificent changes in the color and appearance.