రత్నాచల్ కి టెండర్

Railway To Sell Damaged Ratnachal Express Compartments

10:06 AM ON 25th March, 2016 By Mirchi Vilas

Railway To Sell Damaged Ratnachal Express Compartments

ఆ విషయం గుర్తుందా. గత జనవరి 31న తుని దగ్గర కాపు గర్జన అనంతర పరిణామాల్లో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కి నిప్పు పెట్టడం. భోగీలు దగ్దం కావం , దీంతో వారం పదిరోజులు రత్నాచల్ ఆగిపోయి , ఆ తర్వాత కొత్తది రావడం తెల్సిందే. ఇక ఆరోజు నిప్పు పెట్టిన ఘటనలో ఆ మంటల్లో మొత్తం 17 బోగీలు కాలిపోయాయి. తరువాత కొత్త బోగీలు తెచ్చి మళ్లీ రత్నాచల్ ను పురుద్ధరించారు. అయితే.. కాలిపోయిన బోగీలు ఎందుకూ పనికిరానందున వాటిని స్క్రాప్ కింద విక్రయించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం టెండర్లు పిలిచింది. ప్రస్తుతం విజయవాడలో ఈ కాలిన భోగీలు ఓ మూల మూలుగుతున్నాయి. ఈ బోగీలను కొనదలిచినవారు టెండర్లు దాఖలు చేయొచ్చంటూ తాజాగా ప్రకటన ఇచ్చారు. టెండర్లలో ఎక్కువ ధరను కోట్ చేసినవారికి వాటిని విక్రయిస్తారు. నిత్యం ఎందరినో అటు ఇటు మోసుకెళ్ళిన ఈ భోగీలు టెండర్ లో చేతులు మారాక ఏ రూపం సంతరించుకుంటాయో మరి.

English summary

Railway to sell damaged Ratnachal Express Compartments. In Jasnuary during Kapu protest Ratnachal express was fired by the Protesters in Tuni.