ఆసీస్-విండీస్ టెస్ట్: నాలుగోజూ వర్షార్పణం 

Rain Stops Aus-WI Third Test

06:17 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Rain Stops Aus-WI Third Test

సిడ్నీలో ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మూడోటెస్ట్‌ కు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. నాలుగోరోజు సైతం వరుణుడి ప్రతాపంతో ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మూడోరోజు ఒక్క బంతి పడకుండానే ఆట రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న వెస్టిండీస్‌ ప్రస్తుతానికి 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. రాందిన్‌(30), రోచ్‌(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకా ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌ డ్రాగా ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకుంది.

English summary

Due to heavy rain the third test match between Australia and West Indies was stopped