గుజరాత్‌ లయన్స్‌ కెప్టెన్ గా రైనా

Raina As Gujarat Lions Captain

11:31 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Raina As Gujarat Lions Captain

టీమిండియా టీ20 స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా ఐపీఎల్‌ కొత్త టీమ్ గుజరాత్‌ లయన్స్‌ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. నూతన ఫ్రాంచైజీ రాజ్‌కోట్‌ తమ జట్టుకు గుజరాత్‌ లయన్స్‌గా పేరు పెట్టింది. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్‌ బ్రాడ్‌హడ్జ్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని ఫ్రాంచైజీ యజమాని కేశవ్‌బన్సాల్‌ తెలిపారు.

గుజరాత్‌ లయన్స్‌ జట్టులో న్యూజిలాండ్‌ విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, డేన్‌ బ్రావో, రవీంద్ర జడేజా, జేమ్స్‌ ఫాల్క్‌నర్‌ ప్రధాన ఆటగాళ్లు. ఈ నెల 6న నిర్వహించే ఆటగాళ్ల వేలంలో రోస్టర్‌ పద్ధతిలో జట్టులో మిగతా ఆటగాళ్లను రాజ్‌కోట్‌ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకోనుంది. రైనా గత ఐపీఎల్‌ వరకు ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఆడాడు. ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ విచారణలో జస్టిస్‌ ఆర్‌ఎం లోథా కమిటీ ఈ జట్టుపై రెండేళ్ల నిషేధం విధించడంతో రాజ్‌కోట్‌ ప్రాంఛైజీ రైనాను దక్కించుకొంది. 2007లో ఐపీఎల్‌ ప్రారంభమైన నాటి నుంచి రైనా ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ అవ్వలేదు. ఐపీఎల్‌లో మొత్తం 132 మ్యాచ్‌లు ఆడిన రైనా 140 స్టైక్‌రేట్‌తో 3,699 పరుగులతో లీగ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లోనూ రైనా మంచి ఫామ్‌ కనబరిచాడు.

English summary

Team India Star Batsman Suresh Raina Selected as Captain for New IPL Team Gujarat Lions.Previously this team was named as Team Rajkot.