అడవిలో రోజుల తరబడి నగ్నంగా ... ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా

Rainbow Festival In Forest

11:43 AM ON 19th December, 2016 By Mirchi Vilas

Rainbow Festival In Forest

ఒక్కోచోట ఒక్కో సంప్రదాయం ఆచారం ఉంటుంది. కొన్ని పద్దతిగా వున్నా, మరికొన్ని షాకిచ్చేలా ఉంటాయి. సరిగ్గా ఇది కూడా అలాంటిదే. అక్కడ ప్రతి ఏటా జరిగే రెయిన్ బో ఉత్సవాల్లో వందలాది మంది నగ్నంగా పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్నవారిని లిథూనియా దేశానికి చెందిన ఫొటోగ్రాఫర్ డేనీస్ వేజస్ (30) తన కెమెరాలో బంధించారు. ఏటా మెక్సికో, గ్వాంటమెలా, మొరాకో, రష్యాలలో అడవుల్లో నిర్వహించే ఈ ఉత్సవాల్లో స్వేచ్ఛాస్వాతంత్ర భావాలు ఉన్న వ్యక్తులు పూర్తి నగ్నంగా పాల్గొంటారు. ప్రకృతి లో మమేకమవుతూ కొన్ని వారాల పాటు గడుపుతారు. అవధులు లేని ప్రేమ, స్వాతంత్ర్యాన్ని ఆస్వాధిస్తారు. ధ్యానం, నృత్యం, యోగా, ఆటలు, సంగీతం వంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రెయిన్ బో ఉత్సవం 1972లో కొలరాడోలో జరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతోంది. ‘‘సంచార జాతులను, ప్రత్యామ్నయ జీవనశైలిని చిత్రీకరించడం నా ఫొటోగ్రఫిలో ముఖ్య విషయం. రెయిన్ బో ఉత్సవాలు కూడా సంచార జాతుల సంస్కృతిలో భాగం.. అందుకే ఈ ఉత్సవాలను చిత్రీకరించాను. అవధులులేని ప్రేమ చాలా అందమైన సామాజిక ప్రయోగం. ఈ ప్రయోగంలో కొన్ని వందలమంది ఏకకాలంలో పాల్గొంటే.. అది మరీ అందంగా ఉంటుంది. ఎటువంటి నియంత్రణలు లేని, ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేని కొత్త ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాన్ని వారు చేస్తున్నారు’’ అని డేనీస్ అన్నారు. ఇదేదో బాగుందని సంబరపడేవాళ్లు చాలామందే వుంటారు. కానీ అక్కడికి వెళ్లే ధైర్యం ఉంటుందా అంటూ కామెంట్స్ పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి: పులి చర్మంపై గల చారల వెనుక అసలు రహస్యం ఇదే!

ఇవి కూడా చదవండి: అమెరికాలో ‘ధృవ’ వసూళ్ల వర్షం

English summary

There was one weird festival and this festival was celebrated without wearing clothes and one of the famous photographer was captured some beautiful pictures of this festival and he also explained about the Rainbow festival.