శీతాకాల వర్షం

Rains In Andhra Pradesh

10:26 AM ON 20th January, 2016 By Mirchi Vilas

Rains In Andhra Pradesh

ఎపిలోని రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో ఈ తెల్లవారుఝామున వర్షపు జల్లులు పడ్డాయి. అసలే శీతాకాలం ఆ పైన ముసురుపట్టి జల్లులు కురిసాయి. దీంతో ఉదయం మరింత చలి పుట్టించింది. వాస్తవానికి నిన్న కూడా వాతావరణం మబ్బులు కమ్మి, కొద్దిపాటి చినుకులు పడ్డాయి. ఈరోజు జల్లులతో వాతావరణం చల్లగా మారింది. మంగళవారం హైదరాబాద్‌లో, రాయలసీమలోని కర్నూలు, రామగుండంలో చిరు జల్లులు కురిశాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇక దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో ఒకటి, రెండు చోట్ల వానలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ మధ్యప్రదేశ్‌లో రెండు రోజుల కిందట ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రాంతం నుంచి ద్రోణి కర్ణాటక వరకు ఉన్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాలపై బుధవారం ద్రోణి ప్రభావం కచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నట్లు వాతావరణశాఖ అధికారి అంటున్నారు.

English summary

A small amount of rains occured in Rajamahendravaram and its rural areas today.Due to effect in south madhya pradesh region