మూడోసారి రాజ్‌తరుణ్‌-అవికాగోర్‌ జంట!!

Raj Tarun and Aika Gor pairing 3rd time

03:06 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Raj Tarun and Aika Gor pairing 3rd time

'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్తా మావ' చిత్రాలతో సూపర్‌హిట్‌ జోడీ గా పేరు తెచ్చుకున్న రాజ్‌తరుణ్‌-అవికాగోరల జంట మూడోసారి జత కట్టడానికి సిద్ధమయ్యారు. మంచు విష్ణు-రాజ్‌తరుణ్‌ హీరోలుగా ఒక మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. మంచు విష్ణుకి జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అమైరా దస్తర్‌ ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్‌ సరసన కొంత మంది హీరోయిన్స్‌ని సంప్రదించగా చివరికి అవికాగోరనే ఫిక్స్‌ చేశారు.

ఓ పంజాబి సూపర్ హిట్‌ సినిమాకు ఇది రీమేక్‌. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుంది.

English summary

Raj Tarun and Aika Gor pairing 3rd time in Manchu Vishnu and Raj Tarun Multistarrer movie and directing by G. Nageswara Reddy.