అదే బెస్ట్ కాంప్లిమెంట్ !!!

Raj Tarun Feels Happy About Ramgopal Varma Comments

01:08 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Raj Tarun Feels Happy About Ramgopal Varma Comments

పెద్ద హీరోలను , రాజకీయ నేతలను అనే బేధం లేకుండా ట్వీట్ లతో ఉతికే ఆరేసే , రామ్ గోపాల్ వర్మ మెచ్చుకుంటూ మాట్లాడితే వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవ్ కదా. అందుకే వర్ధమాన నటుడు రాజ్ తరుణ్ తెగ ఆనంద పడుతున్నాడు. ఉయ్యాల జంపాల చిత్రంతో తెరం గేట్రం చేసిన ఈ విశాఖ చిన్నోడు తాజాగా సుకుమార్ స్కూల్ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్సకత్వంలో వచ్చిన 'కుమారి 21ఎఫ్ ' చిత్రంలో నటించాడు. ఈ చిత్రం బ్లాక్ బ్లస్టర్ టాక్ వచ్చింది. ఈ చిత్రం గురించి రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ , రాజ్ తరుణ్ బాగా చేసాడని కితాబు నిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేసాడట. వర్మ అంతటివాడు మెచ్చుకోలుగా మాటాడితే రాజ్ తరుణ్ ఆనందం మాటల్లో చెప్పగలమా? 'కుమారి 21ఎఫ్ ' చిత్రం యూనిట్ విజయవాడ నుంచి సక్సెస్ టూర్ మొదలు పెట్టింది. రాజమండ్రి చేరిన సందర్భంగా మీడియా మీట్ ఏర్పాటుచేశారు.

ఈసందర్భంగా అడిగిన ప్రశ్నకు రాజ్ తరుణ్ స్పందిస్తూ , వర్మలాంటి దర్శక దిగ్గజం నా గురించి కాంప్లిమెంట్ ఇచ్చారంటే అంతకన్నా ఆనందం ఏముంటుందని వ్యాఖ్యానించాడు. రెండు సినిమాలు షూటింగ్ లో వున్నాయని , త్వరలో గీతా ఆర్ట్స్లోను అలాగే వంశీ దర్శకత్వంలో పనిచేయనున్నట్లు నూనుగు మీసాల చిన్నోడు రాజ్ తరుణ్ చెబుతున్నాడు.

English summary

On the grand success of Kumari 21F film, its film unit has conducted a success tour started from vijayawada and now it reached to rajahmundry. Hero raj tarun felt happy for ram gopal varma words on him