నాని డైరెక్షన్‌లో రాజ్‌తరుణ్‌ 

Raj Tarun in Nani direction

05:15 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Raj Tarun in Nani direction

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావా, కుమారి 21ఎఫ్‌ వంటి హ్యాట్రిక్‌ విజయాలు తరువాత 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమాతో యువ హీరో రాజ్ తరుణ్ కి ఒక ఫ్లాప్‌ తగిలింది. ఈ చిత్రం ఎంత త్వరగా విడుదలైందో అంతే త్వరగా ధియేటర్‌ నుండి వెళ్లిపోయింది. అయితే ఈ ఫ్లాప్‌ ఏమీ రాజ్‌తరుణ్‌ కెరీర్‌కి ఆటంకం అవ్వలేదు. ప్రస్తుతం ఈ యువ హీరో మంచు విష్ణు తో కలిసి మల్టీస్టారర్‌ చేస్తున్నాడు. ఇది కాకుండా గీతా ఆర్ట్స్‌, దిల్‌రాజు బ్యానర్‌ లో చెరొక చిత్రాల్లో నటించడానికి సైన్‌ చేసేశాడు. ఇవిలా ఉంటే మరి కొంతమంది డైరెక్టర్లని కూడా క్యూలో పెట్టుకున్నాడు. ప్రస్తుతం రాజ్‌తరుణ్‌ నాని డైరెక్షన్‌లో ఒక సినిమా చెయ్యడానికి అంగీకరించాడు. నాని అంటే హీరో నాని కాదు.

అయినా నాని కూడా దర్శకత్వ శాఖ నుండే వచ్చాడు, కానీ ప్రస్తుతం స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుని వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రాజ్‌తరుణ్‌ నాని అనే యువ డైరెక్టర్‌ దర్శకత్వంలో సినిమా చెయ్యడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. నాని ఇంతకు ముందు రాజ్‌తరుణ్‌ నటించిన గత సినిమాలకి సహాయ దర్శకుడిగా పని చేశాడు. ఇప్పుడు డైరెక్టర్‌గా మారుతున్నాడు. హీరో నాని భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచనలు కూడా ఉన్నాయని ఇది వరకే చెప్పాడు కాబట్టి. భవిష్యత్తులో నాని దర్శతక్వంలో రాజ్‌తరుణ్‌ నటించే అవకాశాలు కూడా లేకపోలేదు.

English summary

Young Hero Raj Tarun want to act in Nani direction. Nani means he is not hero Nani, he is a debut director.