రెమ్యూనరేషన్ లేదు కానీ...గిఫ్ట్ గా విల్లా..?

Raj Tarun Signs Three Films

10:39 AM ON 16th June, 2016 By Mirchi Vilas

Raj Tarun Signs Three Films

టాలీవుడ్ లో ప్రవేశించిన వేళా విశేషమేమిటో గానీ, యువహీరో రాజ్ తరుణ్ మాంచి ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. తాజాగా మూడు చిత్రాలకు బుక్ అయ్యాడు. దీంతో ఇతనికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. ఈ మధ్య కొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకోవలసి వచ్చినప్పటికీ ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ అనే నిర్మాణ సంస్థ తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్రకారం.. ఈ మూడు సినిమాలకు పని చేస్తాడట..వీటిలో ఇది వరకే రిలీజైన ఈడో రకం..ఆడో రకం మూవీ ఉంది.

దొంగాట ఫేమ్ వంశీ కృష్ణ తోను, కోలీవుడ్ కు చెందిన ఓ దర్శకునితోను వర్క్ చేస్తున్న నేపథ్యంలో రెండు ప్రాజెక్టులకు రాజ్ ఓకె చెప్పాడని తెలిసింది. మరో సినిమా ప్రపోజల్ కూడా ఉంది. ఈ మూడు సినిమాలకు తన రెమ్యునరేషన్ గా సొమ్ము బదులు ఓ విల్లాను రాజ్ కు గిఫ్ట్ గా ఇవ్వడానికి ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇలా కంటిన్యూగా మూడు సినిమాలకు పని చేయాలని రాజ్ మంచి నిర్ణయం తీసుకున్నాడని అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి:అక్కడ లోన్ కావాలంటే అమ్మాయిలు నగ్నఫోటోలు ఇవ్వాలట!

ఇవి కూడా చదవండి:షికార్లు ముగిసాయి ... ఇక సెట్స్ పైకి ...

English summary

Uyyala Jampala Movie Fame Young Hero Raj Tarun was become popular with his movies and now he signed three movies with A.K.Entertainments and he was going to take a villa instead of remuneration to his three movies.