హ్యాట్రిక్‌ హీరోతో లేడీస్ టైలర్ కి సీక్వెల్!! 

Raj Tarun To Act In Ladies Tailor Sequel

04:59 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Raj Tarun To Act In Ladies Tailor Sequel

తెలుగులో సూపర్ హిట్ అయిన ఓ సినిమా ఇప్పుడు సీక్వెల్ గా రాబోతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ‘ఉయ్యాల జంపాల’లో సూరి పాత్ర, ‘సినిమా చూపిస్త మావ’లో కత్తి రోల్, ‘కుమారి 21 ఎఫ్‌’లో సిద్దు నేమ్ ఇలా పక్కింటి అబ్బాయి తరహా పాత్రల్లోనే ఎక్కువ కనిపిస్తూ, ప్రేక్షకులను మెప్పించి, ‘హ్యాట్రిక్‌ హీరో’గా నిలిచిన రాజ్ తరుణ్ త్వరలోనే 'లేడీస్‌ టైలర్‌’కి కొనసాగింపుగా ఓ సినిమా చేస్తున్నాడట. తాజాగా 'సీతమ్మ అందాలు ... రామయ్య చిత్రాలు' చిత్రంలో నటించిన రాజ్ ఈ సినిమా విడుదల సందర్భంగా కొత్త సినిమా గురించి చెప్పాడు. లేడిస్ టైలర్ కి సీక్వెల్ గా తీసే సినిమాలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ అవుననే సమాధానం ఇచ్చాడు. అది కూడా వంశీ దర్శకత్వం లోనే వస్తుందట. గతంలో నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ హీరోగా వంశీ డైరెక్షన్ లో వచ్చిన 'లేడీస్ టైలర్' అనూహ్య విజయం సాధించింది. పుట్టు మచ్చ చుట్టూ తిరిగే కధతో తీసిన ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడు దేని చుట్టూ అల్లుకుంటుందో మరి.

English summary

Young Hero Raj Tarun To Act in "Ladies Tailor " Sequel which was going to be directed by Senior Director Vamsi. This news was confirmed by Hero Raj Tarun. Previously Hero Rajendra Prasad's "Ladies Tailor " movie was hit at box office