'సమంత' కావాలంటున్న రామయ్య!!

Raj Tarun want to act with Samantha

05:39 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Raj Tarun want to act with Samantha

కెరీర్‌ ప్రారంభంలోనే ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్‌ సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ తాజా సినిమా రొమాంటిక్‌ లవ్‌స్టోరీ 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'. ఈ సినిమా జనవరి 29న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా రాజ్‌ తరుణ్‌ ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సమావేశంలో మీకు ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్‌తో నటించడానికి ఇష్టపడతారు అని అడిగితే, నాకు సమంత అంటే చాలా ఇష్టం సమంత తో చాలా క్రష్‌ ఉంది. అందుకే నాకు ఛాన్స్ వస్తే సమంతని హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసుకుంటాను అని రాజ్‌ తరుణ్‌ చెప్పాడు. అయితే రాజ్‌ తరుణ్‌ కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందో లేదో వేచిచూడాలి.

English summary

Young Hero Raj Tarun want to act with Samantha. It is his dream to share screen with Samantha. Raj Tarun latest movie Seethamma Andalu Ramayya Sitralu is releasing tomorrow(January 29th)