ఒవైసీ మీద కత్తి పడింది

Raj Thackeray cuts cake with Owaisis photo

10:40 AM ON 15th June, 2016 By Mirchi Vilas

Raj Thackeray cuts cake with Owaisis photo

ఎంఐఎం సీనియర్ నేత అసదుద్దీన్ ఒవైసీ మీద మహారాష్ట్ర నాయకుల్లో ఆగ్రహం చల్లారడం లేదు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే జన్మదినం నాడు ఒవైసీ ఫోటోతో కూడిన కేక్ ను వారు కట్ చేసి తమ కోపాన్ని ప్రదర్శించారు. సెంట్రల్ ముంబైలోని దాదర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో..ఒవైసీ తీరును పలువురు తప్పు పట్టారు. భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని తాను ఉచ్చరించబోనని ఆయన గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆయన మహారాష్ట్రకు వస్తే మెడ మీద కత్తి పెడతామని కూడా ఎంఎన్ఎస్ నేతలు హెచ్చరించారు. కాగా వారి చర్యను హైదరాబాద్ లో ఎంఐఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ పార్టీ నేత..వారిస్ పఠాన్.. ఇలాంటి చర్యలను తాము సహించబోమని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ కేక్ ఎవరు కట్ చేశారో వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తానికి ఈ లొల్లి ఎటు తిరిగి ఎటు మళ్ళుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:బస్టాండ్, రైల్వేస్టేషన్ లో ఫోన్ ఛార్జింగ్ పెట్టారో ఇక అంతే!

ఇవి కూడా చదవండి:కాపు మీడియా రాబోతోందా..!

English summary

MIM Party Chief Asaduddeen Owaisi photo was cutted in Maharashtra on the birthday celebrations of Raj Thackeray Birthday.