'రాజా చెయ్యి వేస్తే' ట్రైలర్

Raja Cheyyi Veste trailer

11:25 AM ON 26th March, 2016 By Mirchi Vilas

Raja Cheyyi Veste trailer

నారా రోహిత్‌, ఇషా తల్వార్‌ జంటగా నటించిన, తారకరత్న కీలక పాత్ర పోషించిన ‘రాజా చెయ్యివేస్తే’ చిత్రంలోని పాటలు శుక్రవారం విజయవాడలో విడుదలయ్యాయి. ప్రదీప్‌ దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి నిర్మించారు. సాయికార్తీక్‌ స్వరాల్ని సమకూర్చారు. ఆయనకిది యాభయ్యో చిత్రం. పాటల విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సీడీని విడుదల చేశారు. ప్రముఖ కథానాయకుడు, హిందూపూర్‌ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ‘‘కొంతమంది తీసే సినిమాలు చూస్తే భయమేస్తుంది. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టదు. విలువలు పెంచే సినిమాలు రావాలి" అని అన్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘రెండు కుంటుంబాల మధ్య పండగ జరుపుకొన్నట్టు ఉంది. మొన్ననే మేం తాతలం ఇద్దరం మనవడి మొదటి పుట్టినరోజును జరుపుకొన్నాం. విజయవాడలో ఈ కార్యక్రమం జరగడం నా అదృష్టంగా భావిస్తున్నా. సినిమా ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావులతో పాటు, గోపీచంద్‌ ఆచంట, శ్యామ్‌ కాసర్ల, వెనిగళ్ల రాంబాబు, సుబ్బరాయశర్మ, రామాంజినేయులు, డ్రాగన్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.


English summary

Raja Cheyyi Veste trailer