సరికొత్త లుక్ లో నారా రోహిత్, తారకరత్న!!

Raja Cheyyi Vesthe first look motion poster

04:53 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Raja Cheyyi Vesthe first look motion poster

నారా రోహిత్ తాజాగా నటిస్తున్న చిత్రం 'రాజా చెయ్యి వేస్తే'. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ప్రదీప్ దర్శకత్వం వహిస్తుండగా, వారహి చలనచిత్రం పతాకం పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రోహిత్ సరసన 'గుండె ఝారి గల్లంతయ్యిందే' ఫేమ్ ఇషా తల్వార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో నందమూరి తారకరత్న మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా ఇటీవలే విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నారా రోహిత్, తారకరత్న సరికొత్త లుక్ లో దర్శనమిస్తున్నారు. ఈ పోస్టర్ ని చూస్తుంటే కచ్చితంగా ఒక వినూత్న కథకి రోహిత్ శ్రీకారం చుట్టాడని తెలుస్తుంది. మీరు కూడా ఈ పోస్టర్ ని ఒక లుక్ వెయ్యండి.

English summary

Raja Cheyyi Vesthe first look motion poster. Nara Rohit and Isha Talwar is romancing first time in this movie. Tarakaratna is playing a important role in this movie.