‘రాజా చెయ్యి వేస్తే’ టీజర్ రిలీజ్ డేట్ 

Raja Cheyyi Vesthe Teaser Release Date

10:04 AM ON 20th February, 2016 By Mirchi Vilas

Raja Cheyyi Vesthe Teaser Release Date

టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేకతను చూపిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న నారా రోహిత్ , ప్రస్తుతం తన కెరీర్‌లో పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న’రాజా చెయ్యి వేస్తే’ సినిమా చేస్తున్నాడు.’అమరావతి’ సినిమాలో విలన్ పాత్ర పోషించి మెప్పించిన తారకరత్న ఈ సినిమా లో కూడా విలన్ గా నటిస్తున్నాడు. ప్రదీప్ చిలుకూరి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి తన వారాహి సంస్థ పై ఈ సినిమా నిర్మిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన ’రాజా చెయ్యి వేస్తే’ మోషన్ పోస్టర్ కు మంచి స్పందన రావడంతో ఇప్పుడు ఈ సినిమా టీజర్ ఫస్ట్ లుక్ ని ఈ నెల 22 న తారక రత్న పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ’గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేమ్ ఇషా తల్వార్ ఈ సినిమా తో మళ్లీ తెలుగులో నటిస్తోంది.

English summary

Young Hero Nara Rohit New Film Raja Cheyyi Vesthe Film first look to be released 22nd february on the occassion of Taraka Ratna Birthday.Taraka Ratna Was acted as Villain in this movie.