అసెంబ్లీ ముందు ఉరి వేసుకుంటా

Rajahmundry MP Murali Mohan Fires On Sakshi Newspaper

11:09 AM ON 4th March, 2016 By Mirchi Vilas

Rajahmundry MP Murali Mohan Fires On Sakshi Newspaper

బినామీ పేర్లతో భూములు కొన్నానని తప్పుడు కథనాలు రాసి, సాక్షి పత్రిక తమపై బురద జల్లుతోందని టీడీపీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌ మండిపడ్డారు. భూ ఆరోపణలపై స్పందించి, ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. ఒకవేళ వీటిని, నిరూపిస్తే అసెంబ్లీ ఎదుట ఉరి వేసుకుంటానని గతంలోనే చెప్పానని ఆయన పేర్కొంటూ, వైఎస్‌, పీజేఆర్‌ తమపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయారని ఆయన అన్నారు. నిజాయితీగా ఉండేవారిని బతకనివ్వరా? అంటూ మురళీమోహన్‌ ఆవేశంగా ప్రశ్నించారు.

' ఆ రోజుల్లో కాంగ్రెస్‌ నేత పి. జనార్థన్‌రెడ్డి ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. గవర్నమెంట్‌ భూములన్నీ చంద్రబాబు మురళీమోహన్‌కు ధారాదత్తం చేస్తున్నారని, మురళీమోహన్‌, చంద్రబాబుకు బినామీ అని ఆయన స్టేట్‌మెంట్‌ లో వుంది. దాని పై చాలా కోపం వచ్చింది. బాబుకు, నాకు ఎలాంటి లావాదేవీలు లేవన్న విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించా' అని మురళీమోహన్‌ వివరించారు. ఆ తర్వాత వైఎస్‌, బాబుపై వంద తప్పులు అని చెప్పి కోర్టులో కేసు వేశారని, అందులో ఒక తప్పు తన గురించి ఉందని, ఆ రోజు కూడా వైఎస్‌ స్టేట్‌మెంట్‌ ఖండించానని మురళీమోహన్‌ చెప్పారు.

సాక్షి పేపర్లో ఎదుట మనిషిపై ఎలాంటి రాళ్లు వేయాలనే ఆలోచిస్తున్నారని, గురివింద గింజకు కింద నలుపు ఉన్న సంగతి తెలియదని జగన్‌ను ఉద్దేశించి మురళీమోహన్ ఎద్దేవా చేశారు. జగన్‌పై ఎన్ని అక్రమ కేసులు ఉన్నాయో, వైఎస్‌ హాయాంలో రూ. లక్ష కోట్లు దోచుకున్నారో అందిరికీ తెలిసిన విషయమేనని, జైల్లో ఉండి వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందేనని ఆయన ద్వజమెత్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడ, వైజాగ్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేద్దామని నిర్ణయించానని వైజాగ్‌లో కొంత భూమి, విజయవాడలో దుర్గమ్మ వారధి వద్ద 7 ఎకరాలు మాత్రమే కొన్నానని ఆయన చెప్పారు. ఇప్పటికైనా అవాస్తవాలు రాయడం మానుకోవాలని మురళీమోహన్‌ హెచ్చరించారు.

English summary