26నుంచి రాజమండ్రిలో ఇంటర్ డిస్ట్రిక్ట్ వాలీబాల్ టోర్నీ

Rajahmundry To Host Inter District Volley Ball Tourney

05:36 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Rajahmundry To Host Inter District Volley Ball Tourney

రాజమండ్రిలో నవంబర్ 26 నుంచి మూడు రోజులపాటు ఎపి సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఆర్ట్స్ కాలేజి మైదానంలో డాక్టర్ పరిమి రామచంద్రరావు ఫ్లడ్ లైట్ వాలీబాల్ కోర్ట్ లలో మెన్ అండ్ వుమెన్ విభాగంలో నిర్వహించే ఈ టోర్నీ లో ఎపిలోని 13జిల్లాల నుంచి 11 టీం ల చొప్పున పాల్గొంటాయి. ఈస్ట్ గోదావరి వాలీబాల్ అసోసియేషన్ , సిటీ వాలీబాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యాన జరిగే డాక్టర్ పరిమి రామచంద్రరావు మెమోరియల్ ఫ్లడ్ లైట్ వాలీబాల్ టోర్నీ కోసం అదనంగా మూడు కోర్టులు సిద్ధం చేస్తున్నారు. నాలుగేసి విభాగాలుగా విభజించి , లీగ్ కం సూపర్ లీగ్ అండ్ నాకౌట్ పద్దతిలో టోర్నీ వుంటుంది.

ఇక్కడ ఎంపికైన టీం లు 2016 జనవరి 2 నుంచి బెంగళూరులో జరిగే నేషనల్ వాలీబాల్ టోర్నీలో పాల్గొంటాయి. మొత్తం 54మ్యాచ్ లు ఫ్లడ్ లాట్ల కాంతిలో జరుగుతాయి. డాక్టర్ పరిమి రామచంద్రరావు ట్రస్ట్ తరపున టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పరిమి వాసు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎపి వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ , ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎ రమణారావు , జిల్లా సెక్రటరీ వై బంగార్రాజు , ఆబోతుల శ్రీనివాసరావు , మోహన్ , రంగా , తదితరులతో కల్సి పరిమి వాసు శనివారం ఉదయం మీడియా కు వివవరాలు తెల్పారు. 26వ తేదీ సాయంత్రం టోర్నమెంట్ మొదలవుతుంది. జిల్లా కలెక్టర్ హెఛ్ అరుణ కుమార్ , ప్రజా ప్రతినిధులు , ప్రముఖులు పాల్గొంటారు.

అయితే వాలీబాల్ కి ఇండోర్ స్టేడియం లో ప్రాక్టీస్ వుండాలి. కానీ రాజమండ్రి లో ఇండోర్ స్టేడియం అందుబాటులో లేకపోవడం పట్ల క్రీడాకారుల్లో నిరసన వ్యక్తం అవుతోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా , స్టేడియం కార్యరూపం దాల్చకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

English summary

Rajahmundry to host inter district level volley ball tournament from 26th of this month.teams from various districts of andhrapradesh will participate in this tourney.