సెంథిల్‌పై కత్తి ఎత్తిన రాజమౌళి!

Rajamouli and Senthil kumar comedy fighting in set

06:29 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Rajamouli and Senthil kumar comedy fighting in set

బాహుబలి సినిమాతో తెలుగు సినిమాని అంతర్జాతీయంగా తీసుకెళ్లిన క్రెడిట్‌ రాజమౌళిది. తెలుగులో టాప్‌ డైరెక్టర్‌ ఇతనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ స్టార్‌ హీరో రాజమౌళి దర్శకత్వంలో నటించాలని తహతహలాడుతూ ఉంటారు. రాజమౌళి గొప్ప డైరెక్టరే కాదు తెలివైన మాటకారి కూడా. ఇతర ఆడియో ఫంక్షన్‌లకి అతిథిగా వెళ్ళిన రాజమౌళి తన స్టైల్‌లో ఆ డైరెక్టర్లని పొగుడుతూ మెప్పించడమే దానికి ఉదాహరణ. రాజమౌళి తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా మంచి మంచి విషయాలతో అభిమానులకు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. అయితే రాజమౌళి సరదాగా తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఒక ఫోటోని షేర్‌ చేశాడు.

ఆ ఫోటోలో రాజమౌళి తన సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌కుమార్‌పై కత్తి దూస్తున్నాడు. ఆ సన్నివేశాన్ని ఫోటోగా తీసి పోస్ట్‌ చేయడం ఒక విశేషమైతే, తను పెట్టిన ఫోటోకి తన స్టైల్‌లో కామెంట్‌ పెట్టడం రాజమౌళి హాస్యభరితాన్ని తెలియజేస్తుంది. ఆ కామెంట్‌ ఏమిటంటే నాకు మా కెమెరామెన్‌కి మధ్య క్రియేటివ్‌ విభేధాలను ఇలాగే పరిష్కరించుకుంటామని తెలియజేశాడు. రాజమౌళి తన సినిమాలో నటించే నటీనటులకి తన దర్శకత్వ ప్రతిభతో తను తీసే సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం ఈ యంగ్‌ & ఛార్మ్‌ డైరెక్టర్‌ స్పెషాలిటీ.

English summary

Rajamouli and Senthil kumar comedy fighting in set