రాజమౌళి శిష్యుడు కి ఫ్లాప్!!

Rajamouli disciple get flop

05:43 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Rajamouli disciple get flop

ఓటమి ఎరుగని దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి శిష్యుడు జగదీష్‌ 'లచ్చిందేవికి ఓ లెక్క లెక్కుంది' సినిమాతో దర్శకుడిగా మరాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, నవీన్‌ జంటగా నటించారు. లావణ్య భలేభలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలతో వరుస విజయాలు సాధించింది. ఈ రోజు విడుదలైన లచ్చిందేవి ఓ లెక్కుంది సినిమాతో హ్యట్రిక్‌ సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్‌ రివర్స్‌ అయింది. రాజమౌళి శిష్యుడు జగదీష్‌ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. కానీ ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. కధలో ఎంచుకున్న పాయింట్‌ కొత్తదే అయినప్పటికీ ఈ కధను దర్శకుడు సవ్యంగా నడపలేకపోయాడు. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకోలేకపోయింది.

English summary

Rajamouli disciple get flop with Lachimdeviki O Lekkundi. This movie is directed by Rajamouli disciple Jagadeesh. Lavanya Tripathi and Naveen Chandra was romanced in this movie.