రాజమౌళిని భయపెట్టిన బాలయ్య

Rajamouli fears about Balakrishna

06:54 PM ON 28th April, 2016 By Mirchi Vilas

Rajamouli fears about Balakrishna

దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి'. 2015లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా జాతీయ అవార్డు కూడా దక్కించుకుంది. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా బాహుబలిని తల దన్నేలా 'బాహుబలి 2' ని రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాహుబలి కంటే అద్భుతంగా యుద్ధ సన్నివేశాలు ఉండాలని రాజమౌళి ప్లాన్ చేసాడంట. కానీ ఈ సన్నివేశాలు ఎలా తియ్యాలో రాజమౌళి ఆలోచనలో పడ్డాడట. దానికి కారణం నందమూరి బాలకృష్ణ 100వ సినిమా అట. వివరాల్లోకి వెళితే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' జీవిత కధ అని అందరికీ తెలిసిందే. ఆ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించబోతున్నాడు.

శాతకర్ణి జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని క్రిష్ పరిశోధకుల ద్వారా తెలుసుకుంటున్నాడట. అటు ఆర్కియాలజీ ద్వారా కూడా శాతకర్ణి గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాడట క్రిష్. ఇక ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం మొరాకో నగరాన్ని షూటింగ్ స్పాట్ గా ఎంచుకున్నాడు. బాహుబలి లో యుద్ధ సన్నివేశాలని తలదన్నేలా గౌతమీపుత్ర శాతకర్ణి లో చూపించాలనుకుంటున్నాడు క్రిష్. ఇందుకోసం 5 భారీ చిత్రాలని వెయ్యిస్తున్నాడు క్రిష్. ఈ విషయాలు తెలుసుకున్న క్రిష్ ముందుగా అనుకున్న విధంగా 'బాహుబలి 2' లో యుద్ధ సన్నివేశాలు తియ్యడానికి నిరాకరించారు. భారీ మార్పులు చెయ్యడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

English summary

Rajamouli fears about Balakrishna. S.S. Rajamouli want to change war scenes in Baahubali 2.