కబాలి విషయంలో ఫీలయిపోతున్న జక్కన్న

Rajamouli Feeling Sad for Misses Kabali First Show

01:15 PM ON 22nd July, 2016 By Mirchi Vilas

Rajamouli Feeling Sad for Misses Kabali First Show

టికెట్ దొరక్క కొందరు , మొట్ట మొదటి షో కి దొరక్క మరికొందరు తెగ బాధపడి పోవడం సహజం. ఇక సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులంటే ఇక చెప్పక్కర్లేదు. తాజాగా రిలీజైన కబాలి సినిమా టికెట్ దొరకలేదని భవనం మీంచి దూకి ఓ అభిమాని స్యూసైడ్ చేసుకున్నాడు కూడా. రజనీ అభిమానులంటే సాదా సీదా వాళ్లే కాదు. చోటామోటా హీరోలు, దర్శకులతో పాటు బడా హీరోలు, దర్శకులు కూడా రజనీ అభిమానుల లిస్ట్లో ఉన్నారు. అందులో టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఉన్నాడండోయ్. బాహుబలితో తెలుగు సినిమా అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేసిన రాజమౌళి.. తలైవాకు గొప్ప వీరాభిమానట. అందుకే రజనీకాంత్ సంచలన చిత్రం ‘కబాలి’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేకపోయానని రాజమౌళి తెగ ఫీలవుతున్నాడు. తాను థియేటర్లో ఉండి ఉంటే, ఎంతగా తలైవా మానియాలో మునిగిపోయేవాడినో అంటూ రాజమౌళి ట్వీట్ చేసాడు. అంతేకాకుండా ఫేస్బుక్లో కూడా తన ఫీలింగ్ను షేర్ చేసాడు. అనుకున్న సమయానికి ‘బాహుబలి’ పార్ట్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆ సినిమా షూటింగ్లో రాజమౌళి బిజీగా ఉన్న కారణంగా కబాలి మిస్ అయ్యాడు.

ఇది కూడా చూడండి: పూజావేళల్లో ఏ ఏ పువ్వులు వాడాలో తెలుసా?

ఇది కూడా చూడండి: ఈ స్టార్ హీరోలు సినిమాల్లోకి రాక ముందు ఏం చేశారో తెలుసా

ఇది కూడా చూడండి: ప్రపంచంలోని అతి పెద్ద 500 కంపెనీల్లో మనవి ఇవే

English summary

Rajamouli feeling sad because of missed kabali first show